Site icon Sanchika

నామం రమణం

[box type=’note’ fontsize=’16’] అంతా రమణమయమేనని  అంటున్నారు జొన్నలగడ్డ సౌదామినినామం రమణం” కవితలో. [/box]

నామం రమణం కామం రమణం
భౌమం రమణం ప్రేమం రమణం
భూమం రమణం శ్యామం రమణం
అరుణాచలపతే రఖిలం రమణం

దేహం రమణం గేహం రమణం
నాహం రమణం కోహం రమణం
సోహం రమణం స్నేహం రమణం
అరుణాచలపతే రఖిలం రమణం

సత్యం రమణ మసత్యం రమణం
నిత్యం రమణ మనిత్యం రమణం
కృత్యం రమణ మకృత్యం రమణం
అరుణాచలపతే రఖిలం రమణం

చరణం రమణం శరణం రమణం
కిరణం రమణం కరుణం రమణం
తరుణం రమణం అరుణం రమణం
అరుణాచలపతే రఖిలం రమణం

మౌనం రమణం జ్ఞానం రమణం
ధ్యానం రమణం స్నానం రమణం
గానం రమణం పానం రమణం
అరుణాచలపతే రఖిలం రమణం

దివ్యం రమణం నవ్యం రమణం
భవ్యం రమణం భావ్యం రమణం
సవ్యం రమణం సేవ్యం రమణం
అరుణాచలపతే రఖిలం రమణం

అచలం రమణం ప్రచలం రమణం
సుచలం రమణం కుచలం రమణం
విచలం రమణం నిశ్చల రమణం
అరుణాచలపతే రఖిలం రమణం

శిష్టం రమణం దుష్టం రమణం
ఇష్టం రమణం కష్టం రమణం
దృష్టం రమణం అదృష్టం రమణం
అరుణాచలపతే రఖిలం రమణం

Exit mobile version