Site icon Sanchika

నమ్ముతారా మీరైనా!!!

[dropcap]ఎం[/dropcap]తో ప్రేమగా పెంచిన పూల తోట
నన్ను కాదని వెళ్ళింది ఇక
ఎదురుగా కనిపిస్తూ నన్ను
ఎంతో వేదనకి గురిచేస్తూ..

నన్ను కాదని అంటూనే నా వైపు
పూల నవ్వులు విసురుతూ..
అవి రవ్వలు పుట్టిస్తూ నా గుండెన
రాదని తెలిసి కాదనుకోలేక
ఔననికూడ అది
నాదని అనుకోలేక ఆకాశాన్ని
అంటిన దుమ్ము దులుపుతూ
నేను అంతలా ఆక్రోశించా
ప్రియా.. రా.. రమ్మని
నమ్ముతారా మీరైనా!!!
ఆ పూలతోట నాదని??????

Exit mobile version