1.
చిట్టి ఆత్మకు
అనంతశాంతి…
మానవాతీత
న్యాయం జరిగినప్పుడే!
2.
కడుపు నిండితే
కాలు బద్ధకిస్తుంది
మాడితే
చేయి పనిచేస్తుంది!!!
3.
విద్యార్థులు రోడ్లమీద
ప్రవహిస్తున్నారు
లక్ష్యం
విదేశాలవైపేమో…!!!
4.
పది మెదళ్ళు
స్పందించాయి…
మనిషిగా
జన్మ ధన్యం…!!!
5.
ఎక్కడిదీ
ప్రశాంతత?
స్నే’హితుని’
ఆగమన సూచన…!!!
6.
గరీబైనా
అమీరైనా
బేధం లేనిది
తలదీపానికే…!!!
7.
ఏ వయసుకు
ఆ ముచ్చట…
ఏ ఎండకు
ఆ గొడుగు…!!!
8.
దేవురించడం
ఆత్మ..”హత్యే”…
బతికే ఆయుధం
ఆత్మవిశ్వాసమే…!!!
9.
కోరిక కోడలికి
పసిమొగ్గ బలి…
నరమాంసం
కూరండి విధవకి….!!!
10.
కలంలో
ఇంకు ఆవిరయ్యింది…
ఇక శాసనాలన్నీ
రక్తంతో…!!!