[dropcap]డా.[/dropcap] భీంపల్లి శ్రీకాంత్ రచించిన కవితల సంపుటి ఈ పుస్తకం. పాలమూరు సాహితి, మహబూబ్‌నగర్ వారి ప్రచురణ ఈ పుస్తకం.
***
తెలుగు కవిత ‘ఛంద పరిష్వంగం’ వీడిన తరువాత పలు విభిన్నమైన ప్రక్రియలను ఏర్పాటు చేసుకుని కవులు తమ భావ ప్రకటన చేస్తున్నారు. ‘మొగ్గలు’ అలాంతి ఓ నూతన ప్రయోగాత్మక కవితా ప్రక్రియ. ఇందులో మొదటి రెండు చరణాలు విషయం చెప్తాయి. మూడవ చరణం మొదటి రెండు చరణాల సారాన్ని ఉపమాన సహితంగానో, సామెతగానో అభివర్ణించాలి. ఈ రకమైన కవితా ప్రక్రియకు శ్రీకారం చుట్టింది భీంపల్లి శ్రీకాంత్. అయితే ఈ ప్రక్రియలో గణ, యతి, ప్రాస నియమాదుల గురించి ఎలాంటి నియమాలు ఉన్నాయో వివరంగా తెలియాల్సి ఉంటుంది.
మొగ్గలు కవితా ప్రక్రియ ఆధారంగా సృజించిన తండ్రి స్మృతి కవిత్వం ‘నాన్న మొగ్గలు’. ఇవి వ్యక్తి జీవితంలో నాన్న గొప్పతనాన్ని, ప్రాధాన్యతని ప్రదర్శించే మొగ్గలు. మచ్చుకి కొన్ని మొగ్గలు:
సూర్యునిలా అగ్నిగుండాలను గుండెలో దాచుకున్నా
చంద్రునిలా చల్లని వెన్నెలను కురిపిస్తూనే ఉంటడు
నాన్నంటే సమస్యల గరళాన్ని మింగేటి గరళకంఠుడు.
ఈ మొగ్గల్లో చివరి పాదాలను ఒక చోట పెట్టి ప్రత్యేకంగా చూస్తే నాన్న విశేషణాలు, నాన్న గొప్పతనం స్పష్టమవుతాయి.
ఓర్పు నేర్పు నాన్నకు వెన్నతో పెట్టిన విద్య
పిల్లల కోరికలను తీర్చే కల్పతరువు నాన్న
ముళ్ళబాటను పూలబాటగా మార్చేది నాన్న
చేదు జ్ఞాపకాలతో ఊరే కన్నీటి ఊట నాన్న
కర్పూరంలా కరిగి బతుకు జీవి నాన్న
బతుకు పుస్తకంలో పూసిన పువ్వు నాన్న
బిడ్డల భవితకు పునాది వేసేది నాన్న
కష్టాలను చెప్పుకోలేని కన్నీటి సజల నేత్రం నాన్న
ఇవి ప్రతి మొగ్గలో మూడవ పాదం.
***
నాన్న మొగ్గలు (స్మృతి కవిత్వం)
రచన: డా. భీంపల్లి శ్రీకాంత్
ప్రచురణ: పాలమూరు సాహితి
పేజీలు: (18+30) 48
వెల: అమూల్యం
ప్రతులకు:
డా. భీంపల్లి శ్రీకాంత్,
ఇం.నెం. 8-5-38, టీచర్స్ కాలనీ,
మహబూబ్‌నగర్
ఫోన్: 9032844017