[dropcap]కొ[/dropcap]త్తపల్లి ఉదయబాబు 16 కథల సంపుటి – నాన్నకో ‘బహుమతి’!.
ఉదయబాబు గారి కథలన్నిటా బాగా పరిచితులైన మనుషులే బాగా కనిపిస్తారు. అందరూ మన ఇరుగుపొరుగు వారిలాగే అనిపిస్తారు. వారందరి బహిరంతర యుద్ధారావాల్నే వింటాము మనము. వారి వారి ప్రవర్తన విధానాల ద్వారా సమూహాలకు చెందిన రొదనీ, హోరునీ మనకు ఎరుక పరుస్తారు వారు.
సమాజ పరిశీలనా దృష్టి నిశితంగా ఉన్న ఉదయబాబుగారు వ్రాసిన వైవిధ్యభరితమైన కథానికల సంపుటి ఇది అని విహారిగారు ‘అనేక పార్శ్వాల్లో సమాజ స్థితి’ అనే ముందుమాటలో రాశారు.
ఈ పుస్తకంలోని 16 కథలలో కొన్ని కథల పేర్లు: కావ్యావిష్కరణ, జగమంత కుటుంబం నాది, పరిమళం లేని మనిషి, అవిటి మనసు, కృతజ్ఞతలతో, కన్నంత మాత్రన.
కథానికా ప్రియులకు ఆనందాన్నిస్తుందీ కథల సంపుటి.
***
(16 కథల సమాహారం)
రచన: కొత్తపల్లి ఉదయబాబు
పేజీలు: 188,
వెల: రూ.150/-
ప్రతులకు:
కొత్తపల్లి ఉదయబాబు,
డో. నెం.42-581/1, ఫ్లాట్ నెం: 105,
శ్రీసాయిసదన్ అపార్ట్‌మెంట్స్, గ్రీన్ హిల్స్,
కాప్రా మునిసిపల్ ఆఫీసు ఎదురుగా,
కుషాయిగుడా బస్ డిపో,
మెయిన్ రోడ్, హైదరాబాద్ 500040
ఫోన్: 9441860161