[dropcap]ర[/dropcap]చయిత్రి షెహనాజ్ రచించిన 22 చిన్న కథల సంపుటి ‘నాన్నకు సలామ్’.
“నేను నా జీవితంలోని అనుభవాలను, అనుభూతులను, సంఘటనలను ఇతివృత్తాలుగా తీసుకుని కథలుగా మలచుకుంటూ ఉంటానని రచయిత్రి ‘స్వగతం’ అనే ముందుమాటలో వివరించారు. ‘ఈ కథా సంకలనంలో ఎక్కువగా ముస్లిం కుటుంబ నేపథ్య కథలు వ్రాయడం జరిగింద’నీ రాశారు.
“ఈ కథల్లో సామాజిక సమస్యలెన్నో చర్చకు వచ్చాయి. కథలన్నీ కుటుంబ నేపథ్యంలోంచి వచ్చినవే. కుటుంబంలోని భిన్న వ్యక్తుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు, ఆచార వ్యవహారాలు, ఆధ్యాత్మిక విశేషాలు, ధనదాహం, ఆర్థిక అసమానతలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, వాటి వైఫల్యాలు, దంపతుల మధ్య తలెత్తే పొరపొచ్చాలు, వాటి పర్యవసానాలు, విడాకులు, తప్పటడుగులు, పశ్చాత్తాపాలు, ఇలా ఎన్నో అంశాలు దర్శనమిస్తాయి” అని ‘ఆప్తవాక్యం’ అందజేసిన మహాసముద్రం దేవకి రాశారు. “జీవితాన్ని విలువలతో కూడినదిగా తీర్చిదిద్దుకోడానికి ఈ కథలు చక్కగా ఉపకరించేలా శిల్పీకరించారు షెహనాజ్” అని అభినందించారు. ఈ సంకలనంలోని కొన్ని కథల పేర్లు: ఆరడుగుల స్థలం, మంచి మార్గం, గమ్యం, తలాక్, అనైతికం, చివరకు మిగిలేది, ధార్మికత గెలిచింది, అంతర్జాలంలో బందీ అవుతున్న బాల్యం, ఒక అమ్మ కథ.
***
షెహనాజ్ కథలు
పేజీలు:112,
వెల: రూ.100/-
ప్రతులకు: ఇంటినెంబరు 27,
స్టేట్ బ్యాంక్ కాలనీ,
అనంతరపురం 515001
ఫోన్: 9346263070