[dropcap]తె[/dropcap]లుగు ఇంటర్నెట్ పత్రికల్లో నూతన ఒరవడి సృష్టిస్తూ, పాఠకాదరణను అధికంగా సాధిస్తున్న వెబ్ పత్రిక ‘సంచిక’ సరికొత్త శీర్షికలను, విభిన్నమైన రచనలను అందించటంలో ముందుంటుంది.
ఇందులో భాగంగా, జీవితమంతా భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దటంలో గడిపి, సమాజ నిర్మాణంలో ఎలాంటి గుర్తింపును, పొగడ్తలను ఆశించకుండా, తమ బాధ్యతను నిజాయితీగా నిర్వహించిన అధ్యాపకులు, ఉపాధ్యాయుల జీవిత విశేషాలను అందించే శీర్షిక ‘వందే గురుపరంపరాం’ ఆరంభించింది.
ఈ శీర్షికకు అనుబంధంగా, ‘నన్ను ప్రభావితం చేసిన నా గురువు’ అనే శీర్షికను ఆరంభించాలనుకుంటోంది ‘సంచిక’.
మనకు సినిమా స్టార్లు దేవుళ్ళు!
క్రికెట్ స్టార్లు దైవాలు!!
దొంగలు, నేరస్థులు ఆదర్శం!!!
మన చొక్కాలు, బనియన్లు, టీషర్టులపై, విదేశీ హింసాత్మక విప్లవ గూండాల బొమ్మలు!!!
కానీ, తల్లితండ్రుల తరువాత అంతగా మన జీవితాలను ప్రభావితం చేయటమే కాదు, కొన్ని తరాలను ప్రభావితం చేయటం ద్వారా, సమాజ గతిని నిర్దేశించగలిగే అధ్యాపకులు, ఉపాధ్యాయులను అప్పుడప్పుడయినా తలచుకోము. నిశ్శబ్దంగా, ప్రచారాలకు దూరంగా, నిజాయితీతో చిత్తశుద్ధితో తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఏమీ ఆశించని కర్మయోగుల్లాంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులను తలచుకుందాం.. వారిని గౌరవించుకుందాం అన్న ఆలోచనతో ఆరంభిస్టోందీ కొత్త శీర్షికను ‘సంచిక’.
ఈ శీర్షికన, తమను ప్రభావితం చేసిన గురువుల గురించి రాసి ‘సంచిక’కు పంపవలసిందిగా అభ్యర్ధిస్తోంది ‘సంచిక’. నిడివి పరిమితి లేదు. లభ్యమయితే, అధ్యాపకుల ఫోటో పంపండి.
మీ రచనను మెయిల్ ద్వారా అయితే kmkp2025@gmail.com కు, వాట్సాప్ ద్వారా అయితే 9849617392కు, పోస్ట్ ద్వారా అయితే Sanchika, Plot No 32, H. No 8-48, Raghuram Nagar Colony, Aditya Hospital Lane, Dammaiguda, Secunderabad-83 కు పంపాలి.