Site icon Sanchika

‘నారద భక్తి సూత్రాలు’ – కొత్త ధారావాహిక- ప్రకటన

[dropcap]శ్రీ[/dropcap]మతి సంధ్యా యల్లాప్రగడ సంచిక కోసం అందిస్తున్న ఆధ్యాత్మిక సుమమాలిక ‘నారద భక్తి సూత్రాలు’.

చిన్నప్పుడు మనం చాలా సార్లు రేడియోలో వినేవాళ్ళం.. “భక్తునికి భగవంతుని అనుసంధానపరిచే దర్బారుబత్తి” అని.

తరువాత కాలంలో అది తలుచుకుని నవ్వుకున్నాం.

కాని లోతైన భావముంది అందులో..

భగవంతుని భక్తుని అనుసంధాన పర్చేది ఏమిటి? అని.

అది వేరేదేదీ కాదు కేవలం భక్తి మాత్రమే..

***

నేతలా అన్న చిన్న గ్రామం హిమాలయాలలో గంగోత్రికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.  అక్కడ భగీరథీ తీరాన ఉన్న శివానంద కుటీరు గొప్ప ఆధ్యాత్మిక కూటమి. శ్రీ శివానంద ప్రియశిష్యులు శ్రీ విష్ణుదేవానంద సాధన చేసిన ఆశ్రమం అది.

ఆ స్వామీజీని జలసమాధి చేసినది కూడా అక్కడే.

ఆ చోట వాతావరణంలో భక్తి నిండి ఉంటుంది.

కఠినమైన ఆశ్రమ నియమాల మధ్య కార్తీకమాసపు చల్ల గాలులలో, శివనామం విడవక స్మరిస్తూ ‘నారద భక్తి సూత్రాలు’ అన్న గ్రంథాన్ని శ్రీ శివానంద మహారాజ్ రచించిన వ్యాఖ్యానంతో, మరియు వ్యాసాశ్రమ శ్రీ మలయాళ స్వామివారి వ్యాఖ్యానంతో కలిపి పఠించే అవకాశం శ్రీమతి సంధ్యగారికి లభించింది.

ఆ సమయంలో రాసుకున్న నోట్సుని మిత్రులతో, తోటి సాధకులతో పంచుకునే ప్రయత్నమే ఇది.

సంచికలో వారం వారం మీరూ చదివి భక్తి యొక్క ప్రాముఖ్యతను భక్తుల అనుభవాలను తెలుసుకొని మీ అనుభవాలు పంచుకుంటారని ఆశిస్తున్నాము.

***

నారద భక్తి సూత్రాలు‘ – అతి త్వరలో.. సంచికలో..

Exit mobile version