నవలా రాణికి పద్య నివాళి!

    1
    2

    [box type=’note’ fontsize=’16’] ప్రముఖ నవలా రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి మరణం అభిమానులకెంతో వేదన కలిగించిందనీ, ఓ అభిమానిగా తన పద్యాలతో ఆమెకు నివాళి అర్పిస్తున్నారు నండూరి సుందరీ నాగమణి. [/box]

    [dropcap]సు[/dropcap]ప్రసిద్ధ నవలా రచయిత్రి, మనకందరికీ ఎంతో ఆత్మీయురాలు అయిన శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి ఆకస్మిక నిష్క్రమణం అభిమానుల హృదయాలకు అశనిపాతమే అయింది. ఆచంద్ర తారార్కం ఆమె వ్రాసిన మధురమైన నవలలు చదువరులను ఆనందాంబుధిలో డోలలూపుతాయి.  ఆమెకు నివాళిగా నా పద్యములను సమర్పించుకుంటున్నాను.

    కం.

    మధురము కద శైలి తనది,
    మధురము చదివింపగ మరి మమతల వాగై;
    మధురము కథనము చదువగ
    మధురము తలచగను యామె మదిలోనెపుడూ! (1)

    కం.

    సుందర వర్ణనలెన్నో,
    అందరి మనములను దోచెనామె కథలతో;
    పందిరి వేసెను సుమముల
    విందుగనొసగియు నవలల పెక్కుగనల్లీ! (2)

    కం.

    వాణీ పుత్రిక నిజముగ
    నాణెపు నవలల సులోచనారాణి కదా
    వేణువు వీణానాదము
    ప్రాణము సాంత్వన కలుగగ పలికించె మదిన్! (3)

    కం.

    నవలలనెన్నియొ తానే
    అవలీలగనే రచించె యద్భుత రీతిన్
    అవనిని తెలుంగు కథకులు
    పవనపు వీవన విధంబు పాటించిరిగా! (4)

    కం.

    పొగరే యొక యాభరణము
    వగరే లాగెను యువకుల వయసును వలగా;
    నగవే ముచ్చట గొలుపును
    తగవే నిత్యము జయంతి తా శేఖరుతో! (5)

    కం.

    ఆరడుగుల వాడు పొడవు
    కారున్న యతడు మనస్సు గలవాడతడే;
    కారుణ్యముయతనికి సిరి
    చోరుడు తా శేఖరమ్ము సుదతీ హృదికే! (6)

    కం.

    అమ్మా యద్దనపూడీ!
    కొమ్మా కోటిగ రచనల కొసరుగనిచ్చీ,
    అమ్మో వెడలితివెందుకు,
    వమ్మే చేసీ వచనము వసుధను వదలీ? (7)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here