నవ్వులరేడు రేలంగి

0
2

[dropcap]తె[/dropcap]లుగు నాటకరంగ చరిత్ర ప్రారంభం గురించి చెప్పడం కష్టం. చాళుక్యుల పాలనకు ముందు నుంచే తెలుగునాట నాటక ప్రదర్మనలు ఏదో ఒకరూపంలో ఉన్నట్లు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. ‘అంకమాలిక’ అనే గేయనాటికలు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది.1860 లో శ్రీ కోరాడ రామచంద్రశాస్త్రిగారి ‘మంజరిమధుకరీయం’తో తెలుగునాటకరంగం ప్రారంభం ఐనదని పరిశోధకులు నిర్ఢారించారు.

ఎందరో నటతేజోమూర్తులు సగర్వంగా నాటక రంగంనుండి వేదికనుండి వెండితెరకు వెళ్ళారు. అలా వెళ్ళినవారిలో ఒకరైన రేలంగి వెంకట్రామయ్య తూర్పుగోదావరి జిల్లా రావులపాడులో 1919 ఆగస్టు 9న జన్మించారు. వీరి తండ్రి రామస్వామి హర్మోనియం పెట్టెలు రిపేరు చేస్తుంటే తను సహాయపడేవారు. పెద్దగా చదువు అబ్బకపోయినా, నటనపట్ల ఆసక్తితో కాకినాడలోని ‘యంగ్ మ్యాన్స్ హ్యాపీక్లబ్’లో చేరి పలు ప్రదర్సనలు యిస్తుండేవారు. నాటి ప్రముఖ సినీ, స్టేజి హాస్యనటుడు జోగినాధం గారి వద్ద శిష్యరికం చేయమని ప్రముఖ సినీ దర్మకుడు చిత్తజల్లు పుల్లయ్యగారు సలహా యివ్వడంతో అలానే చేసారు.

1935 ఏప్రిల్ 12 న విడుదలైన ‘శ్రీకృష్ణతులాభారం’ చిత్రంలో రేలంగి తొలిసారిగా వసుదేవుని పాత్రలో నటించి 75 రూపాయల పారితోషికం పొందారు. ఇంకా ఈ చిత్రంలో ‘ఋష్యేంద్రమణి’, ‘కాంచనమాల’, ‘లక్ష్మిరాజ్యం’ వంటి వారు కూడా  పరిచయం చేయబడ్దారు. అనంతరం మీర్జాపురం రాజావారు నిర్మించిన ‘గొల్లభామ’ (1949) లో నటించారు (అంజలిదేవి ఇదే చిత్రంలో పరిచయం చేయబడ్డారు). ఈ రెండు చిత్రాలకు రేలంగి సహాయదర్మకుడిగా పనిచేసారు. ‘గుణసుందరి కథ’లో నటించారు. 15-3-1951న విడుదలైన ‘పాతాళభైరవి’ చిత్రంలో రాణిగారి (విమలారావు) తమ్ముడిగా నటిస్తూ ‘తాళలేనే నే తాళలేనే’ – ‘వినవేబాల నాప్రేమ గోల’ పాటలు స్వయంగా పాడుకున్నారు. అనంతరం వాహినివారి ‘పెద్దమనుషులు’ చిత్రంలో తిక్కశంకరయ్య పాత్ర అద్బుతంగా పోషించారు.

12-1-1955న విడుదలైన విజయావారి ‘మిస్సమ్మ’ చిత్రలో దేవయ్య పాత్ర పోషిస్తూ ‘ధర్మం చెయి బాబు’- ‘సీతారాం సీతారాం’ పాటలు స్వయంగా పాడుకున్నారు. 14-1-1959న విడుదలైన ‘అప్పుచేసి పప్పుకూడు’ చిత్రంలో భజగోవిందం పాత్రలో బాగా నటించారు. 19-4-1962న విడుదలైన ‘భీష్మ’; 9-4-1962న విడుదలైన ‘చెంచులక్ష్మి’ చిత్రాలలో నారదుని పాత్ర ధరించారు. అంజలిదేవితో ‘సతీ సక్కుబాయి’, ఎస్.వరలక్ష్మిగారితో ‘మామకు తగ్గ అల్లుడు’; 1960లోసావిత్రి గారితో కథానాయకుడిగా నటించారు.

తన కుమారుని పేరు మీద ‘సమాజం’ అనే చిత్రం నిర్మించారు. తాడేపల్లిగూడెంలో ‘రేలంగిమందిర్’ అనే సినిమా థియేటర్ నిర్మించారు. వీరి కుమారుడు సత్యనారాయణబాబు బాలనటుడుగా నటించినచిత్రం ‘రాజయోగం'(1968)

ఆ రోజుల్లో రేలంగికి జరిగినన్ని సన్మానాలు మరే నటుడికి జరుగలేదు. ఆస్ధానకవి శ్రీపాదకృష్ణమూర్తి రేలంగికి ‘హాస్యనటచక్రవర్తి’ బిరుదు ప్రదానం చేసారు. సినీ నటులలో తొలి ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందారు.

తొలితరం నటుడిగా జీవితాన్ని ప్రారంభించి 500 పైగా చిత్రాలలో నటించినా, తన ఉన్నతికి కారణమైన నాటకరంగాన్నిమరువకుండా, తరచూ ప్రదర్మనలు యిస్తూ ‘చింతామణి’ నాటకంలో ‘సుబ్బిశెట్టి’ పాత్ర వందలసార్లు పోషించారు. అలానే 11-4-1956న విడుదలైన ‘చింతామణి’ చిత్రంలో సుబ్బిశెట్టి పాత్ర పోషించారు. ఇంకా ‘మనదేశం’ (24-11-1949), ‘జయసింహ’ (21-10-1955), ‘మాయబజార్’ (27-3-1957), ‘వీరకంకణం’ (16-51957), ‘వద్దంటే డబ్బు’ (25-6-1954), ‘రాజు పేద’ (6-11-1959), ‘బండరాముడు’ (27-5-1960), ‘రాణి రత్నప్రభ’ (9-8-1961), ‘జగదేకవీరుని కథ’ (7-6-1962) వంటి చిత్రాలలో తన నటవైదుష్యంతో నవ్వించిన రేలంగి 27-11-1975 న కన్నుమూసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here