[dropcap]నీ[/dropcap] జ్ఞాపకం ఓనాడు
మంటలా మండుతుంటే
ఈనాడు నీ జ్ఞాపకం
స్మృతిలా వెలుగునిస్తోంది
వనాన పండు వెన్నెలలా
దినాన వెలుగురేఖలా
నా హృదయం నీ పరమైంది
నీ హృదయం నాకు వలైంది
వదలనంటోంది ఒక్క క్షణం
నాదో లోకం నీదో లోకం
మేఘుని ఉరుముకి చంద్రుని అలక
కంటిపై కనుపాప అలక
పాయల్ పై పాదం అలక
కృష్ణునిపై రాధ అలక
..ప్రియా నీ పై నా అలక..