నీ కోసం..!

0
1

[dropcap]ని[/dropcap]ను చూడని క్షణం..
సముద్రపు ఘోషలా
నా గుండె చప్పుడు

నీవు పలకని క్షణం..
అగ్నిపర్వతంలా
నా మస్తిష్క ఆలోచనలు

నిను వీడిన క్షణం..
సునామీలా
నా మనో ఫలకంపై ఉప్పెనలు

నీవు నవ్వని క్షణం..
భూకంపంలా
నా హృదయ ప్రకంపనలు

నిను తలవని క్షణం..
తుఫానులా
నా ప్రణయ ప్రళయాలు

నీవు లేని క్షణం..
నా తనువంతా
ప్రకృతి బీభత్సాలు

అందుకే నిను వీడను క్షణమైనా
నీ కోసం జయిస్తా మరణాన్నైనా
నీ ప్రేమకై ఉదయిస్తా ఎన్ని జన్మలైనా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here