[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘నీ ప్రేమతో’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]కొ[/dropcap]మ్మలకన్నా నీ సిగలోనే
కుసుమం అందంగా ఉంటుంది
తేనేపట్టులోకన్నా నీ అధరంలోనే
తేనె మధురంగా ఉంటుంది
దుప్పటిలోకన్నా నీ కౌగిలిలోనే
తనువు వెచ్చగా ఉంటుంది
ప్రకృతిలోకన్నా నీ మేనులోనే
సౌందర్యం చక్కగా ఉంటుంది
ఒంటరిలోకన్నా నీ జంటలోనే
నా మనసు పులకరిస్తుంది
తోడులేని నా మది నీ ప్రేమతోనే
కలకాలం పరవశిస్తుంది..