Site icon Sanchika

నీ రూపే (గజల్)

[dropcap]కు[/dropcap]నుకురాని నా కళ్ళకు అగుపించెను నీ రూపే

తూరుపింట సూరీడై ప్రభవించెను నీ రూపే

*

ఏటిలోన నే దిగితే కొంటెగాలి నవ్వెనులే,

పైట చెంగు లాగేస్తూ ప్రకటించెను నీ రూపే

*

తోటలోకి నేవెళితే మావికొమ్మ ఒరిగెనులే,

జాజికొమ్మ చెంతవాలి నినదించెను నీ రూపే,

*

కోవెలలో దేవికి నే హారతివ్వ, ఆవెలుగున,

నీ నగవే కదలాడుతు వికసించెను నీ రూపే

*

నీ చూపులె చుక్కానై పయనింతును నీకోసం,

నా రేపటి ఆశలలో చిగురించెను నీ రూపే

 

Exit mobile version