[dropcap]ఉ[/dropcap]దయించే భానుడికి తెలుసు ప్రతి వేకువ తనదేననీ
నిదురించే రేరాజుకు తెలుసు ప్రతి రాత్రి తనదేనని
ఎగిసిపడే కెరటానికి తెలుసు ప్రతి పయనం వెనుకకేననీ
గర్జించే మేఘానికి తెలుసు ప్రతి చినుకు అవని పైకేననీ
వీచే గాలికి తెలుసు ప్రతి ఊపిరిని నిలపాలని
మరి మనిషిగా జన్మించిన నీకు తెలుసా
ఈర్ష్యా ద్వేషాలను వదిలి అందరిలో ఒక్కరిగా, ఒక్కరిలో అందరిగా జీవించాలని…
మనిషి అంటే తన కోసం కాక ఇతరుల కోసం బ్రతకాలని…
మరణించినా కాని అందరిలో జీవించాలని….
నీకు తెలుసా!