నీలగిరుల యాత్రానుభవాలు -2

0
3

[box type=’note’ fontsize=’16’] వేసవిని గడపడానికి దక్షిణ భారతదేశంలో ‘కోటగిరి’ ఉత్తమమైన ప్రాంతమని తెలుసుకుని నీలగిరుల యాత్ర చేసిన డి. చాముండేశ్వరి తమ యాత్రానుభవాలు వివరిస్తున్నారు. [/box]

[dropcap]అ[/dropcap]నుకున్న రోజున ఉదయం 5గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి జడ్చర్లలో డ్రైవ్ ఇన్ హోటల్‌లో చక్కని అల్పాహారం తిని ప్రయాణం కొనసాగించాము. ఎండగా ఉన్నా కార్ ఏసీ వల్ల ఉపశమనం. దారిలో వస్తున్న ఊర్లను చూస్తూ, అవి చెందుతున్న మార్పులను గమనిస్తూ గతానుభవలను గుర్తుచేసుకుంటూ ప్రయాణం సాగింది.

అనంతపూర్ బైపాస్ రోడ్‌లో ఉన్న హైదరాబాద్ చెఫ్ అనే కొత్త హోటల్‌లో లంచ్‌కి ఆగాము. ఎండలో ప్రయాణిస్తున్న కార్‌కి కూడా కొంత రెస్ట్ కావాలి కదా! కారుని చెట్టు కింద నీడలో ఉంచి హోటల్ లోకి వెళ్ళాము. చెట్లు నీడ అవసరం ఎండ వేళ ప్రయాణంలో బాగా తెలుస్తుంది. టెంపరేచర్‌లో తేడా. ఏసీ రూంలో లంచ్ చేసాం. ఫుడ్ బాగుంది. దగ్గర్లోనే కియా మోటార్స్ కర్మాగారం ఉన్నందున కొరియన్స్, కొరియా భాష పోస్టర్స్ దోవ పొడవునా కనిపిస్తాయి.

కొన్ని స్కూల్స్‌లో కొరియన్ భాషని బోధిస్తారని ఆనంతపూర్‌లో చెప్పారు.

కొద్దిసేపు రెస్ట్ తరువాత మా ప్రయాణం కొనసాగించాము. కియా మోటార్స్ నిర్మిస్తున్న చోటు కనిపించింది. చాల పెద్ద ప్రాంతం. అక్కడ నుండి బెంగుళూరుకి సాయంత్రానికి చేరాము. జలహళ్ళిలో ఉన్న న్యూ బెల్ ఎయిర్ అనే హోటల్‌లో ఇస్రోకి దగ్గర్లో రూమ్ తీసుకుని నైట్ హల్ట్ చేసాము. సాయంత్రం పెద్ద వాన పడింది. తెల్లవారు ఝామున 5 గంటలకి బయలుదేరి సిటీ ఉదయం ట్రాఫిక్ పెరిగే లోపు సిటీ లిమిట్స్ దాటాము. దోవలో కాఫీ తాగాము. బ్రేక్ ఫాస్ట్ టైమ్‌కి రామనగరి చేరాము. ఆ ఊరిలో చెక్కతో చేసిన అనేక బొమ్మలు, ఎడ్యుకేషన్ టాయ్స్ అమ్ముతుంటే మా మనవరాలికి కొన్ని కొన్నాము. చందనపు వస్తువులు కూడా బావున్నాయి.

అక్కడ నుండి మాండ్య మీదుగా మైసూర్ బైపాస్ రోడ్ మీదుగా ఊటీకి ప్రయాణం సాగించాము. కోటగిరికి వెళ్లాలంటే ఊటీ దాటాలి.

బందిపూర్ పులుల అభయారణ్యం లోకి ఎంట్రీ అవుతున్నప్పుడే హాయి గొలిపే వనాల సుగంధ భరిత గాలులు ఆస్వాదిస్తూ ప్రవేశించాము. అక్కడి అటవీశాఖ సిబ్బంది వాహనాలను చెక్ చేస్తారు. టోల్ ఉంది.

కర్ణాటక నుండి తమిళనాడు వైపుకి అడుగు పెడుతున్నప్పుడు అక్కడ వారి సిబ్బంది ఉన్నారు. వాహనాలు లైన్ లో ఉన్నప్పుడు వంతెన మీద లెక్కలేనన్ని కోతులు కనిపించాయి.

పచ్చని అడవిని, పూల చెట్లని చూస్తూ ముందుకు వెళితే అక్కడ అటవీశాఖ ఆధ్వర్యంలో నడిపే సఫారీ యాత్ర ఉంది. చాల మంది సఫారీ యాత్ర కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు. మాకు దాని గురించి తెలీదు, అందుకని బుక్ చెయ్యనందుకు ఫీల్ అయ్యాము.

  

పచ్చని అడివిలో దోవలో రోడ్ పక్కాగా వెళ్తున్న ఏనుగుల గుంపుని చూసాము. తరవాత కొంచము సేపటికి నెమళ్ళు, జింకల గుంపు. అడవి దున్న, కణుజులు ఇతర జీవులు, పక్షులు, సీతాకోక చిలుకలు, తేనెటీగలు, పాముల పుట్టలు అనేకం కనిపించాయి. ప్రకృతి లోని వైవిధ్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డాము. చల్లని గాలులు ఏసీ కంటే హాయిని ఇచ్చాయి. చెట్లు ఎంత అవసరమో కదా అనుకున్నాము.

అలా సాగిన మా ప్రయాణం మాసినగుడి ఘాట్ రోడ్ మీదుగా ఊటీ చేరాము. మధ్యాన్నం అయ్యింది. ఊటీలో లంచ్ చేసాము.

అక్కడ నుండి 29 కిమీ ప్రయాణించి మెట్టుపాళయం కోయంబత్తూర్ దోవలో ఉన్న కోటగిరిలో బుక్ చేసుకున్న హోటల్‌కి వెళ్ళాము. టౌన్ మెయిన్ సెంటర్‌కి దగ్గర్లో ఉంది నెహ్రు పార్క్.

హోటల్‌లో మంచి వ్యూ ఉన్న రూమ్‌లో సామాను పెట్టి వేడి తేనీరు సేవించి రిలాక్స్ అయ్యాము. చుట్టూతా టీ తోటలు! రాత్రి డిన్నర్‌కి దగ్గర్లో ఉన్న హోటల్‌లో అల్పాహారం తిని రూమ్‍౬కి వచ్చాము. చాల చలిగా ఉంటే స్వెటర్స్ బయటకి తీసాము.

మరునాటి నుండి స్వయంపాకానికి అవసరమైన వంటిల్లు, స్టవ్ ఏర్పాట్లు చేసారు హోటల్ యజమాని. కొత్త కాపురంలా కొద్ది సామానులతో వంట భలే ఆనందాన్ని కలిగించింది. వంట చేస్తున్నప్పుడు కోతులు లోనికి రాకుండా శ్రీవారు కాపలా ఉండి సాయం చెయ్యటం చక్కని అనుభూతి.

మరిన్ని ఆసక్తికర సంగతులతో త్వరలో కలుద్దాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here