Site icon Sanchika

నీలగిరుల యాత్రానుభవాలు-4

[box type=’note’ fontsize=’16’] నీలగిరుల యాత్ర చేసిన డి. చాముండేశ్వరి తమ యాత్రానుభవాలు వివరిస్తున్నారు. [/box]

బడుగ చరిత్ర:

[dropcap]బ[/dropcap]డుగ గ్రామం లోని వారిని కలిసి మాట్లాడితే వారి చరిత్ర గురించిన అనేక విషయాలు తెలిసాయి.

ప్రపంచంలో ప్రతి ప్రదేశానికి, ప్రజలకు ఏదో ఒక చిన్నదో పెద్దదో కథ, చరిత్ర ఉండే ఉంటుంది. తెలుసుకోవాలనే కోరిక ఉండాలి అంతే. నా ఉద్దేశంలో తెలుసుకోవాలి. చెప్పాలి.

లేదంటే క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో చరిత్రని వక్రీకరించవచ్చు.

నవతరం యువతకు తమ మూలాలు చరిత్ర సరిగ్గా తెలిపే అవకాశం ఎంత మాత్రం వదలొద్దు.

బడుగ తెగ గురించిన నాకు తెలిసిన కొన్ని విషయాలు క్లుప్తంగా వివరిస్తాను.

క్రీస్తుకు ముందే బడగ తెగ వేల వేల సంవత్సరాల క్రితం నీలగిరిలో నివసించారు. వారు 5000 BC నుండి నీలగిరిలో నివసిస్తున్నారు.

సింధు నాగరికత (3300 BC) మరియు నీలగిరి మధ్య విలువైన రాతి వ్యాపారం జరిగింది. మొహంజదారో మరియు హరప్పా వద్ద, అందమైన ఆకుపచ్చ అమెజాన్ రాయి నీలగిరిలోని దొడ్డబెట్ట సమీపంలో కనుగొనబడిందిట. బహుశా దొడ్డబెట్ట అంటే పెద్ద గుట్ట బడగ పదాల నుండి వచ్చిందేమో?

మౌర్యుల కాలంలో (321 BC – 184 AD) బౌద్ధ సన్యాసులు నీలగిరిలోని బడగాలలో బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయడానికి నీలగిరిలోకి వచ్చారన్నారు. అక్కడ బడగాలలో చెట్టు ఆరాధన అనేది ఉంది. బహుశా వారు ప్రకృతి ప్రేమికులు, conservators అయి ఉంటారు.

కదంబ (2AD – 6AD) రాజ్య కాలంలో, నీలగిరిలోని బడగాల నుండి భూమి రాబడి మరియు ఇతర పన్నులు వసూలు చేశారుట. ఆహార ధాన్యాలను ‘కోలగా’, ’20 కోలగా’, ఒక ‘కందుగ’తో కొలుస్తారు, బడగలో ‘కోలగా’ ‘కోగ’. ఇప్పటికీ కోగ అనే పదాన్ని బడగ ప్రజలు ఉపయోగిస్తారట.

క్రీ.శ.1116లో కాలరాజు అనే బడగ రాజు నీలగిరిని పరిపాలించేవాడు. కర్నాటకలోని హోయసల రాజ్యానికి చెందిన విష్ణువర్దనుడు నీలగిరిపై దండెత్తిన మొదటి రాజు, తన సైన్యాన్ని పంపి, బడగలను బెదిరించేందుకు ప్రయత్నించాడు, తనికి కట్టుబడి ఉండమని ఆదేశించాడు.

ధైర్యవంతుడైన బడగ రాజు, కాలరాజు అతని ఆజ్ఞను నిరాకరించి అతనితో పోరాడాడు. అతని రెండవ దండయాత్రలో, హోయసల సైన్యం కాలరాజు కుమారుడిని చంపింది, అతని కుమారుడు మరణించినప్పటికీ, కాలరాజు విష్ణువర్దనునికి లొంగి పోవటానికి ఒప్పుకోలేదు. మూడవ దండయాత్రలో, కాలరాజును హొయసల రాజు చంపాడు.

కోయంబత్తూరు మాన్యువల్ (1898) రచయిత నికల్సన్ ప్రకారం, దండనాయకకోట్టై 1338లో నీలగిరి మరియు వైనాడ్‌లను పాలిస్తున్న మాడప్ప దండనాయకచే నిర్మించబడింది. అతని తరువాత అతని కుమారుడు కేతయ దండనాయకుడు 1321లో మరియు సింగయ దండనాయకుడు 1338లో పాలించారు. వారు నీలగిరిని అణచివేసేవారు.

తరువాత 13వ శతాబ్దంలో, హోయసల రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యం ఓడించింది, కాబట్టి నీలగిరి విజయనగర సామ్రాజ్యం కిందకు వచ్చింది.

విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత నీలగిరి సుల్తాన్ పాలనలోకి వచ్చింది. తరువాత దండనాయకకోటలోని దండనాయకులు మధురై నాయకులపై ఆధారపడి ఉన్నారు. హైదర్ అలీ దండనాయకకోటలో రాజు వీరపాండ్య దేవన్‌పై దాడి చేసి దండనాయకకోటను స్వాధీనం చేసుకున్నాడు. శాసనాలలో నీలగిరి సదరన్ కోటే (నీలగిరిని జయించిన కోట) గురించి ప్రస్తావించబడింది. నీలగిరితో పాటు దండనాయకకోట గ్రామాలు ఒడువంగనాడు అని పిలువబడ్డాయి.

హైదర్ అలీ తర్వాత టిప్పు సుల్తాన్ పాలన:

తరువాత 1799లో బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్‌ను ఓడించి నీలగిరిని స్వాధీనం చేసుకున్నారు కానీ 1818 వరకు వారికి పర్వత ప్రాంతాలు తెలియవు, అయినప్పటికీ దండనాయకకోటే నుండి పన్ను వసూలు చేసారు.

అప్పటి వరకు నీలగిరి మైసూర్ ప్రావిన్స్‌లో భాగంగా ఉండేది. టిప్పు సుల్తాన్‌ను ఓడించిన తర్వాత బ్రిటిష్ వారు నీలగిరిని మద్రాసు ప్రావిన్స్‌లో విలీనం చేశారు. స్వాతంత్ర్యం తరువాత, నీలగిరి శాశ్వతంగా తమిళనాడులో విలీనం చేయబడింది.

తరువాత 1819లో, John Sullivan కోయంబత్తూరు నుండి నీలగిర్స్‌కు ముత్తయ్య గౌడ్ అనే బడగ పెద్ద సహాయంతో వచ్చాడు. అతను మొదట కోటగిరి, తరువాత ఊటకాముండ్ చేరుకున్నాడు. కోటగిరి సమీపంలోని మిలిదానే గ్రామంలో John Sullivan కు మార్గనిర్దేశం చేసిన ముత్తయ్య గౌడ్ గురించిన శాసనం ఇప్పటికీ ఉంది.

బడగ ప్రజలు తమ నివాస స్థలాన్ని పోరంగడు సీమ, తోటనాడు (తోటనాడు తోత్తనాడుగా మారింది) సీమ, మెర్కునాడు సీమ్, కుండే సీమ అని నాలుగు వర్గాలుగా విభజించారు, ఇక్కడ దాదాపు 303 గ్రామాలు ఈ నాలుగు సీమ్‌ల పరిధిలోకి వస్తాయి.

సంఘంలో బడగర్, కనకర్, హరువర్, అతికారి అనే నాలుగు వంశాలు ఉన్నాయి. బడులకు కోలాలు లేవు.

బ్రిటీషర్లు మరియు ఇతర కమ్యూనిటీ ప్రజలు నీలగిరికి రాకముందు “బడుగు” అని పిలువబడే బడగ గిరిజన భాష బడగాలు మరియు ఇతర గిరిజన ప్రజల మధ్య సంప్రదింపు భాష.

బడగా కమ్యూనిటీపై అనేక పరిశోధనలు జరిగాయి ఫ్రెంచ్ భాషా శాస్త్రవేత్త ఒక ముఖ్యమైన పరిశోధన చేశారు. బడగలు నీలగిరిలోని ఆదిమ తెగలని, వారు ఏ భాషా మాండలికం కాదని, ప్రత్యేకమైన భాష మాట్లాడతారని అన్నారుట.

బడగాలు శివుడితో సహా అనేక హిందూ దేవతలను పూజిస్తారు, అయితే వారి ప్రధాన దేవతలు హెతై మరియు అయ్య. వారు ప్రతి సంవత్సరం డిసెంబరు-జనవరి మధ్య ఒక నెల పాటు గొప్ప పద్ధతిలో హేతై హబ్బాను జరుపుకుంటారు.

ఈ ఆదివాసీ తెగలో అధికులు విద్యావంతులు. మేము అనేక మందిని కలిసాము.

కోటగిరి ప్రాంత అభివృద్ధికి కారకుడుగా లోకల్స్, చరిత్ర చెప్పేవారు వెల్లడించిన బ్రిటిష్ కలెక్టర్ John Sullivan గురించి ఇక్కడి ప్రజలు చెప్పింది చెబుతాను.

***

John Sullivan ని ఫౌండర్ అఫ్ ఉదకమండ్ లేదా ఊటీ అంటారు.

వీరు 15 సంవత్సరాల వయసులో ఈస్ట్ ఇండియా కంపెనీ రచయితగా వచ్చారుట డాక్యుమెంటేషన్ చెయ్యటానికి. 1817లో కోయంబత్తూర్‌కి కలెక్టర్ అయ్యారట. ఉదకమండ్ ప్రాంతంలో ఇంగ్లాండ్ దేశపు వాతావరణం కలిగిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వారి పేరుతో ఉన్న స్మారక భవనం ఉంది. ఇది కోటగిరికి చాలా దగ్గరగా ఉంది.

1819లో దక్షిణ ప్రాంతపు ప్రజల నోట అనేక పర్వతాల – ‘బ్లూ మౌంటైన్స్’ కథలు విన్న బ్రిటిష్ అధికారులు నిజానిజాలు తెలుసుకోమని, వారికి ఒక రిపోర్ట్ ఇమ్మని John Sullivan ని పంపించారట.

ఆయన తన సిపాయిల బృందంతో, కఠినమైన ప్రయాణం చేసి, నిటారైన కొండలు, జంతువులను తట్టుకుంటూ, కొంతమంది సిపాయిలను కోల్పోయినప్పటికీ భయపడక నీలగిరి కొండలను చేరారుట. బ్రిటిష్ జండాను ఎగరవేసి ఆధిపత్యాన్ని చాటి చెప్పాడట. ఈ ప్రాంతపు భౌగోళిక వాతావరణం నచ్చిన John Sullivan వ్యక్తిగతంగా బ్రిటిష్ అధికారులకు ఈ ప్రాంతపు ప్రయోజనాన్ని చెప్పి గాయపడిన బ్రిటిష్ సైనికులకి చక్కని ‘రికవరీ రిసార్ట్’గా  ఉపయోగపడుతుందని ఒప్పించాడు. బ్రిటిష్ అధికారులు ముగ్గురు డాక్టర్ల బృందాన్ని పంపి వారి రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారట. మెడికల్ బోర్డు సలహాతో మొదటి బ్యాచ్‌లో 50 అనారోగ్యంతో ఉన్న సైనికులను పంపి చూశారట. John Sullivan తో పాటుగా ఇతర జిల్లాలకు చెందిన బ్రిటిష్ అధికారులు ‘బ్లూ మౌంటైన్స్’ని తమ వేసవి విడిది చేసుకున్నారు. కాలక్రమేణా ఇతరులకు నివాసం అయింది. ఎంతో మంది నాయకులు, సినీ ప్రముఖులు, ఇతరులు నివాసాలు ఏర్పర్చుకున్నారు. జయలలిత కొడనాడు ఎస్టేట్ లాంటివి కలిగి ఉన్నారు. కొడనాడు ఎస్టేట్ వివాదం గురించి తరువాత చెబుతాను.

1822లో John Sullivan తొడ తెగ నుండి కొన్న భూమిపై తన నివాసం స్టోన్ హౌస్ ఊటీలో ఉంది. భార్య, కొడుకుతో, పనివారితో అక్కడికి మారాడు. స్థానిక పంటలు కాకుండా స్థానిక గిరిజనులతో బ్రిటిష్ పంటలయిన ఆలు, బార్లీ, క్యారెట్, టీ లాంటి పంటలు పండించారు.

1823-25 మధ్య ఊటీ లేక్‌ని వాటర్ రిసోర్స్‌గా సృష్టించాడు.

ఇండియాలో పని చేసిన అనేక మంది బ్రిటిష్ వారికి, బ్రిటన్‌కి ప్రత్యామ్నాయంగా పనిచేసింది. వారి వలసలు, అధికారం పెరిగాయి. John Sullivan నీలగిరుల్లోని ఆదివాసీ జాతులకు స్వతంత్ర అధికారం ఉండాలని బ్రిటిష్ అధికారులతో వాదించాడట. వారికే మొత్తం యాజమాన్యం హక్కులుంటాయన్నాడు.

1828 నాటికీ 28 బ్రిటిష్ నివాసాలు, చర్చిలు, మైదానాల నుండి వలస వచ్చిన ప్రజలు ఉన్నారు. ఊటీని బ్రిటిష్ మిలిటరీ కంటోన్మెం‍ట్‌గా చేసారు. Coimbatore కలెక్టర్ పదవి ముగిశాక John Sullivan మద్రాస్ బోర్డు ఆఫ్ రెవిన్యూ లో మెయిన్ member గా తిరిగి ఉదకమండ్‍౬కి వచ్చారట. 1838లో వారి భార్య, కుమార్తె మరణం తరువాత తనకి ఎంతో ఇష్టమైన ‘బ్లూ మౌంటైన్స్’ని వదిలి లండన్‌కి వెళ్లారట.

కోటగిరికి దగ్గరలో ఉన్న Kannerimukku అనే గ్రామంలో ఉన్న John Sullivan రెవిన్యూ ఆఫీస్ బిల్డింగ్ ఉన్న పురాతన శిధిల భవనాన్ని 2015లో Coimbatore కలెక్టర్ ఆధ్వర్యంలో తమిళనాడు ప్రభుత్వం పునరుద్ధరించింది. వారి పేరుతో స్మారకంగా ప్రజల సందర్శనకు తెరిచారు. మేము ఊటీ వెళ్లిన ప్రతిసారి అక్కడకు లాంగ్ డ్రైవ్‌లా వెళ్లి వస్తాము.. ట్రైబల్ ప్రొడక్ట్స్ అమ్ముతారు. చిన్న ప్రదర్శన కూడా ఉంటుంది

Tribals కి చెందిన వివిధ ఫొటోస్ ద్వారా మనకి వారి జీవన విధానం, ఆచారయ్ వ్యవహారాలు వివరిస్తారు. John Sullivan ఉదకమండ్ లేదా ఊటీగా పిలవబడే ప్రాంతాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశారట. స్థానిక రహదారులు, రవాణా, పౌర భవనాలు, న్యాయస్థానం, ఆసుపత్రి, పోస్ట్ ఆఫీస్, జైలు, బ్యాంకు లాంటివి ఏర్పాటు చేశారన్నమాట. అంటే కాదు స్థానిక ఆదివాసీల ఆర్థిక పరిస్థితి మెరుగు పడేలా చేశారట. నేటికీ తమ ప్రాంతపు అభివృద్ధికి కారణం అయిన John Sullivan ని ప్రజలు గౌరవించి ప్రేమిస్తారు.

పాలకులు తమ అధికార ప్రయోజనం పొందుతూ అందుకు కారణం అయిన ప్రజలకు విస్తృత ప్రయోజనాలను కలిగేలా చేస్తే వారు ఎవరైనా జాతి, మతం, దేశంతో సంబంధం లేకుండా గుర్తుండి పోవటమే కాదు ప్రేమని పొందుతారు, సర్ ఆర్థర్ కాటన్‌లా.

Exit mobile version