నీలమత పురాణం – 39

0
2

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

పుష్కరాదీని తీర్థాని వితస్తాద్యశ్చ నిమగ్నాః।

శచీ వనస్పతీ గౌరీ ధూమ్రోర్ణా రూచిరాకృతిః॥

[dropcap]పు[/dropcap]ష్కర వంటి పవిత్ర స్థలాలను, వితస్త, నిమగ్నా వంటి తీర్థాలను, శచి, వనస్పతి, గౌరి, ధూమ్రోర్ణాలను, సినీవాలి, కుహు, రాకా, చానుమతి లను పూజించాలి.

అయతి, నియతి, ప్రజ్ఞ, మతి, వేలా, ధారిణిలతో పాటు విధాతలను పూజించాలి. ఛాందాంసిను పూజించాలి. ఐరావణ, సురభి, ఉచ్ఛైశ్రవసులను పూజించాలి. శాఖ, విశాఖ, స్కంద, నైగమేశ, వాయుదేవతలను, అనారోగ్యాన్ని కలిగించే దేవతలను, జ్వరాలను కలిగించే రోగదేవతలను, వినాయకుడు, కుమారస్వామిలను పూజించాలి. ఋషులు వాలఖిల్య, కశ్యప, అగస్త్య, నారదులను పూజించాలి. అప్సరసలను, సోమరసపానం చేసే దేవతలను పూజించాలి. ఆదిత్యుడు, రుద్రుడు, విశ్వదేవతలు, అశ్వినిలు, భృగులు, అంగీరసుడు, సాధ్వి, మరుత్తులను పూజించాలి.

12 ఆదిత్యులు, ధాత, మిత్ర, ఆర్యమ, పూష, శక్ర, అంశ, వరుణ, భగ, త్వష్ట, వివస్వత, సవిత, విష్ణువులను పూజించాలి.

అప, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాసలనే ఎనిమిది ‘వాసు’లను పూజించాలి. అంగారక, సూర్య, నృత్తి, ఘోష, అజైనపాద, అహిర్భుధ్న్య, ధూమకేతు, ధ్వజ వాహన, ఈశ్వర, మృత్యు, కాపాలి, కంకణ అనే ముల్లోకాల రుద్రులను పూజించాలి. క్రతు, దక్ష, హసు, సత్య, కాల, ధ్వని, మరు, వాక్, ధనుజ లనే పది విశ్వదేవులను పూజించాలి. నాసత్య, దస్త్ర అనే ధ్వనులను పూజించాలి. భువన, భనవ, సుజన్య, సుజాత, త్యాజ, సువ, మర్ధ, దక్ష, చాయ, బంధూక, ప్రశవ, వ్యాయ అనే 12 భృగువులను పూజించాలి.

ఆత్మ, ఆయూష్, మానస, దక్ష, మద, ప్రాణ, హవిస్మ, గరిష్ట, ఋత, సత్య అనే పది శక్తివంతమైన అంగీరసులని పూజించాలి.

మనస, మద, ప్రశ్న, నర, పాల, దితి, హాయ, నయ, హంస, నారాయణ, విభు, ప్రభు అనే 12 సంధ్యలను పూజించాలి.

శక్తివంతమైన 49 మరుత్తులను పూజించాలి.

ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, జ్యోతి, ఏకచక్ర, ద్విచక్ర, త్రిచక్ర, ఋతుజిత్, సుశిణ, సేనజిత్, అగ్నిమిత్ర, అరిమిత్ర, ప్రభుమిత్ర, అపరాజిత, ఋత్, బుల్‌వాన్, ధార్త, నిధార్త, వరుణ, ధృవ, విధారణ, దేవదేవ, ఇద్రక్ష, అద్రక్ష, ఇహద్రక్, అమల్‌సాన, క్రితిన, ప్రసాకృద, దక్ష, సమర, ధాత్, ఉగ్ర, ధానం, భాగ్మ, అభియుక్త, సదసహ, ద్యుతి, వసురాభ, అదృశ్య, వామ, కామజయ, విరాట్ అనే 49 మరుత్తులను పూజించాలి.

కళాత్మక నిర్మాణాలకు ఆద్యుడు విశ్వకర్మను పూజించాలి. విశ్వకర్మను పూజించేటప్పుడు ఆయుధం, వాహనం, గొడుగు, ఆసనం, దుందుభి, చిహ్నం వంటి వాటన్నింటినీ ప్రత్యేకంగా వేర్వేరుగా పూజించాలి. పూలమాలలతో, రంగులతో, దీపాలతో, ధూప దీప నైవేద్యాలతో వాటిని పూజించాలి.

విశ్వకర్మను, అతని వస్తువులు ప్రత్యేకంగా పూజించిన తరువాత గ్రహాన్ని ప్రత్యేకంగా పూజించాలి. భవిష్యత్తులో వచ్చే గ్రహాన్ని, నాగులను, ఆ నెల అధిష్ఠాన దేవతను పూజించాలి.

గ్రహము, మాసము, ఖగోళ శాస్త్రవేత్త ‘నోటి’ లాంటివి. ఖగోళ శాస్త్రవేత్త నుంచి నెల, సంవత్సరం, రోజు, వంటి వాటిని తెలుసుకుని, పూలతో నైవేద్యాలతో పూజించాలి.

ఫలవేద నుంచి నాగుల సంవత్సరాన్ని తెలుసుకుని పూలతో, పళ్ళతో పూజించాలి. మంత్రోచ్చారణతో వెన్న, బార్లీ, యవలు, తిలలతో నిరంతరం పూజించాలి.

బ్రాహ్మణులను వారు పూజించిన గ్రహాన్ని బట్టి ధనం చెల్లించాలి. తరువాత బంధు, మిత్ర, కళత్ర, సేవకులు, బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయాలి.

ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, చరిత్ర వంటి శాస్త్రాలు తెలిసిన బ్రాహ్మణులను ప్రత్యేకంగా ధనం, వస్త్రం, ధాన్యం ఇచ్చి సత్కరించాలి.

ఇతిహాసాలు, పురాణాలు పఠించే, వినిపించే బ్రాహ్మణులను ప్రత్యేకంగా గౌరవించాలి. ప్రతి వ్యక్తి తనను తాను పూలు, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలతో అందంగా అలంకరించుకోవాలి. దీన్ని ‘మహాశాంతి’ అంటారు.

మహాశాంతి అంటే అన్ని పాపాలను నశింపజేసేది. అన్ని దుష్టశక్తులను శాంతింపజేసేది. కలికి సంబంధించిన దుష్టస్వప్నాలను నశింపజేసేది. దీర్ఘాయుష్షును, ధనధాన్య ఐశ్వర్యాన్ని ఇచ్చేది. రోగనాశిని. శత్రునాశిని. దేశాభివృద్ధికారిణి. ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని ఇచ్చేది మహాశాంతి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here