నీలమత పురాణం – 58

1
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]బృ[/dropcap]హదశ్వుడు కశ్మీరంలోని ప్రధాన నాగుల జాబితాను కొనసాగించాడు.

అకాద్ర, బహుకేశ, కేశపింగళ, ధూసర, లంబకర్ణ, గందాల, నాగశ్రీ మధక, అవర్తాక్ష, చంద్రసార, కశ్యాసుర, లంబక, చతుర్వేద, ముగ్గురు పుష్కరులు,  అక్షోటింగ, కంక, స్యేన, వత్తల, కచర, క్షీరకుంభ, నికుంభ, వికుంభ, సమరప్రియ, ఏలిఘన, విఘన, చంద, భోగి, జ్వరాన్విత, భోగ, భాగవత, రౌద్ర, భోజక, దేహిళ, రోహణ, భరద్వాజ, దధీనక్ర, ప్రతార్థన, జానుత, దేవ, శత్రు, మిత్ర, కర్దమ, పంఖ, కిందమ, రంభ, బాహుభోగ, బహుదార, మత్స్య, భీత, బహుల్యాహ, కరుచి, వినత ప్రియ, తనుకార, రజత, వామన, భావక, నాగజ్యోతిష్కక,  వేద్య, ధీరసార, జనార్ధన, వ్లగోధ, దంబర, అశ్వద్ధ, బలిపుష్ప, బలిప్రియ, అంగారక, శనీశ్వరి, నాగ కుంజరక, బుధ, కథి, గృత్య, కుటులక, నాగరాహు, నాగ బృహస్పతి, చౌరాక, తిస్కర, శేలు, నాగసూత, నాగ పౌరోగవ, అజకర్ణ, అశ్వకర్ణ, విద్యున్మాలి, దరిముఖ, ఓరన, రోచన, హసి, నర్తన, గాయక, కంభట, సుభట, బాహుపుత్ర, నిరాచార, మయూర, కోకిల, త్రాత, మలయ, యవనప్రియ, కోటపాల, మహీపాల, గోపాల, పాతాళశూచి, రాజాధిరాజ, వినత, స్వర్గ, విమలక, మణి, చక్రహస్తి, గదహస్త, శూలి, పాశి, సగ, నాగ చిత్రకార, వత్స, బకపతి, సీతార్త, యవమాలి, రావణ, రాక్షసాకృతి, యజ్వ, దాత, హోత, భోక్త, భోగపతి.

ఇన్ని పేర్లు వల్లె వేసిన నీలుడు ఊపిరి పీల్చుకుంటాడు.

ఏతే ప్రధాన్యతో రాజన్నాగేశః కీర్తితమయా।
ఏషాం చయః పరీవారః పుత్ర పౌత్రాధికం చయత।
న తచ్ఛుక్యం మయా రాజవ్యక్తుం వర్ష శతారిపి॥

రాజా ఇప్పుడు నేను చెప్పినవి ప్రధానంగా పేరు పొందిన నాగుల పేర్లు మాత్రమే. ఇలా వీరు కుటుంబాలు, బంధువులు, పుత్ర పౌత్రుల వివరాలాన్నీ నేను చెప్పడం లేదు. అవన్నీ చెప్పాలంతే కొన్ని వందల సంవత్సరాలు కూడా సరిపోవు. ఇంకా నాగులుండే పవిత్ర స్థలాల పేర్లు చెప్పడం కూడా అంతే కష్టం.

నాగులంతా వరాలివ్వగల శక్తి కలవి. ధ్యానిస్తే వరాలిస్తాయి. ఇవన్నీ నీలుడు చెప్పినట్టు వింటాయి. నీలుడి పట్ల విశ్వాసం గలవి. నీలుడి విశ్వాసపాత్రమైనవి. ఇవన్నీ వాసుకికి ప్రియమైనవి.

ఇప్పుడు నేను నీకు దిక్కులకు అధిపతులయిన నాగులు పేర్లు చెప్తాను. వీరంతా కశ్మీరంలోని నలుదిక్కులకు అధిపతులు. వారి గురించి తెలుసుకోవడం ఆవశ్యకం రాజా.

తూర్పు దిక్కును రక్షించేది నాగ బిందుసార. దక్షిణ దిక్కుకు అధిపతి నాగ శ్రీమధక. ఉత్తరాధిపతి నాగ ఉత్తరమానస.

వీరు దిక్కులకు కాపలా కాస్తూండగా, వేలు, లక్షలు, వందల లక్షల సంఖ్యలో నాగులు కశ్మీరంలో తర్కుస్య భయం లేకుండా శాంతిగా, భద్రంగా జీవితం సాగిస్తున్నాయి. నేను నీకు చెప్పిన నాగులలో సదాంగుళ అనే నాగును నీలుడు కశ్మీరం నుంచి బహిష్కరించాడు. సదాంగుళుడి స్థానాన్ని మూడవ మహాపద్మకు ఇచ్చాడు నీలుడు.

ఈ మూడవ మహాపద్మ సరస్సుగా మారేడు. మహాసముద్రం లాంటి సరస్సు. ఒక యోజనం పొడవు, ఒక యోజనం వెడల్పు కల సరస్సును రెండవ సముద్రంలా పరిగణిస్తారు. ‘విశ్వగశ్వ’ అనే రాజు దగ్గర నుంచి మారు వేషంలో మహాపద్ముడు సాధించిన ప్రాంతం ఇది. నీలుడి ఆజ్ఞను అనుసరించి ఈ ప్రాంతాన్ని మహాపద్ముడు ఆక్రమించాడు.

ఇది విన్న గోనందుడికి సందేహాలు వచ్చాయి.

“సదాంగుళుడిని ఎందుకని కశ్మీరు నుంచి నీలుడు బహిష్కరించాడు? విశ్వగశ్వుడి సామ్రాజ్యం సరస్సులా ఎందుకని మారింది? బృహదశ్వ మహాశయా… నా ఈ సందేహాలకు సమాధానాలు ఇవ్వండి” అనడిగాడు.

బృహదశ్వుడు గోనందుడి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం ప్రారంభించాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here