[box type=’note’ fontsize=’16’] నీళ్ళు ఎప్పుడు నవ్వులు కురిపిస్తాయో చెబుతున్నారు సింగిడి రామారావు ఈ కవితలో. [/box]
[dropcap]నూ[/dropcap]తిలోన నీటిలో
నిండా మునిగిన బకెట్టు
గాలిలోన తేలుతూ
పైకి లేచి,గట్టున వాలి
పిల్లల ఒంటి మీదపడి
స్నానం ఆడి
మలినంతో మిలితమై
మురికిని వదిలించిన
ముచ్చట తో కాలువలో
పారుతూ
మొక్కల దాహం తీర్చి
మురిసిపోతూ పూవులుగా
మెరిసినవి నీళ్ళు నవ్వులు