Site icon Sanchika

నీరాజనాలు!

[dropcap]ల[/dropcap]యమైన భావాలన్నీ.. మదిలో హొయలై పోతుంటే…
నిరీక్షణ క్షణాలన్నీ…. ఇలలో అపురూపమై
నీకై… వేచిచూస్తూ…
నా హృదయాంతరాళలో శీతల ఆవాస మొకటి నిర్మించా,
నీ ఎదలోతులలోకు వెళ్లి చూడు, ఆరని చితాగ్ని కనిపిస్తుంది.
స్పృశించిన అనుభూతుల సమ్మోహనాలన్నీ.. నీ చేతుల్లోకి వాలిపోతుంటే…
వాలిపోయిన సమ్మోహనాలన్నీ… అనుభవాల
స్పర్శకై అరాటపడుతుంటే..
నీ అరని చితాగ్నితో.. నన్ను నీలో అణువణువు
కలిపేసుకోవా….!

చిత్రమైన ఆత్రమేదో… నిముషమైనా నన్ను నిలువనీకుంది…
మరెన్నటికీ నిన్ను విడిపోని వీడిపోని అందమైన అనుబంధమవ్వాలని..
నిలువెత్తు ఆరాధనకు రూపమై నేను నీకై నిలవాలని ఉంది..
నడిరాత్రి నిశీధిలో తారకలా మెరుస్తావో…
చంద్రునిలా..వెన్నెలే పంచుతావో…
గ్రీష్మంలా వెచ్చగా నన్ను చుట్టుకుంటావో..
హేమంత తుషారమై నన్ను స్నిగ్ధను చేస్తావో…
నీ చెయ్యి పట్టుకొని ఏడడుగులు వేయాలనుంది..
నిండు పున్నమి సాక్షిగా..!

క్షణమైనా నిలునీయని నీ ప్రేమకై ఏమిచ్చి రుణం
తీర్చుకోను…
మెత్తని పెదవులతో వెచ్చని స్వచ్ఛమైన ముద్దుతో..
నిన్ను ముంచెయ్యనా…
కల్మషంలేని నా కంటికాంతులలో..నిన్ను నిలువెత్తుగా నింపుకొనా…
నా పెదవి వంపులో…చిరునవ్వుగా నిన్ను
అందంగా పొదుపుకోనా..
నీకై జన్మ జన్మలకై వేచివుంటూ నా కన్నులతో
నిత్యం నీరాజనాలు పట్టనా…!

Exit mobile version