[dropcap]నీ[/dropcap] జ్ఞాపకాల ఉయాలలో నేనూగుతుంటే
నీ గుర్చిన నిజాల సుడిగాలులు
నన్ను నిరాశల లోయలోకి పడతోస్తున్నాయి.
నీ ఉహల శిలలనెక్కి పైకొద్దామనుకొంటే
నిన్నలలో నీవు పాడిన నీ జోలలు,
నేడవి నన్ను వెక్కిరిస్తూ వినిపిస్తున్నాయి.
నిస్పృహతో కూడిన నిముషాలు
నన్ను నమిలివేస్తూ కనిపిస్తున్నాయి.
నిందలకు లోనైన నా భావాలు
కుమిలిపోతూ నన్ను స్పృశిస్తున్నాయి,
కరిగిపోతూ నశిస్తున్నాయి.