[డా. బాలాజీ దీక్షితులు పి.వి. రచించిన ‘నీవో మధువిధ్వంసం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నీ[/dropcap] చూపులు
మధుర విధ్వంసం
చేస్తున్నాయి.. నా ఎదన
నీ వదనాలు
మధు తుఫాను
లేపుతున్నాయి.. నా గుండెన
నీ నయగారాలు
నయాగరలా
దూకుతున్నాయి.. నా భావాన
నీ వలపులు
తేనె చిలకలై
వ్రాలుతున్నాయి.. నా అధరాన
నీ సొంపులు
స్వరాలు
మీటుతున్నాయి.. నా నరనరాన
ఈ సంపద చాలదా
నూరేళ్ళు.. నిత్య నూతనంగా
బ్రతకటానికి
నిండైన ప్రేమ-ప్రణయం పంచడానికి