నీవు ఎదుగుతున్న క్రమంలో…

0
2

[dropcap]న[/dropcap]డకలు నేర్పుతున్న నాటి నుండే
నీ భవిష్యత్తుకు ప్రణాళికలు గీస్తూ వస్తున్నాను
నేను కన్న కలల్ని ఎగురవేయాలని
నీవు తపనపడుతూనే ఉన్నావు!

సాకారం చేసుకోవాలనుకునేందుకు ….
దిశానిర్దేశం చేస్తున్నప్పుడే….
నీదారిని చెరిపేయాలని చూసారు!

నీవు ఎక్కుతున్న ఒక్కో మెట్టు వెనుక
నలిగిపోయిన నామనసు దాగివుంది

నిస్సహాయ స్థితి లోనూ ఆశలవీచికలా మారి
నీవు నానుండి జారిపోకుండా కాపాడుకుంటాను…
అమ్మా అనే నీపిలుపుకోసం
ఎప్పటికీ ఎదురుచూస్తూ …
నాకోసం నీవు సృష్టించిన కొత్తపదంలా …
భావన చెందుతుంటాను!

నీకు ఎగరడం నేర్పిన తల్లిపక్షినేకదా నేనూ….!
అయినా నీవు ఎగిరిపోతుంటే….
నా ప్రాణం ఎవరో లాక్కెళ్ళిపోతున్నట్లు అనిపించింది

నీ అభివృద్ధి కోసం …..
తపో దీక్షలో కూర్చున్నట్లు
జీవన సమరం లో నేను…!
గతించిపోయిన కాలాన్ని తవ్వకూడదంటారుకానీ….
ఆకాలంలోనే మన బ్రతుకుల మలుపులో
పడిన వేదనలు రాసిపెట్టి ఉన్నాయి..

డబ్బేలోకమా… అన్న ప్రశ్నకు….
ప్రపంచం డబ్బు వెంటే నడుస్తుందనే సమాధానం వస్తుంది!

మనం పచ్చగా కనిపిస్తేనే తోడబుట్టిన తోడైనా సరే…
చిన్నపిందెనైనా దొరక్కపోదా …
అని వద్దన్నా వస్తారు…!!

మనం చేయిచాస్తే మెటికలు విరిచినవాళ్ళే
లేని బంధాలన్నీకలుపుకుని
జోలె పట్టుకొని కూర్చుంటారు..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here