నీవు నా జ్ఞాపికవి

2
2

[dropcap]నీ[/dropcap]వు నా జ్ఞాపికవి
ఇసుక తిన్నెలపై నా అడుగుల చప్పుడుని
అలల సవ్వడులతో కలిపి నా
స్వప్నావస్థలో నుండి సుప్తావస్థ లోనికి
మోసుకొచ్చిన నా జ్ఞాపికవి
కాలం చిరుగులో దుఃఖపు తెరలు వినిపిస్తుంటే
నీకు నేను తోడున్నానన్నపుడు నీవో జ్ఞాపికవి
పచ్చదనపు చీర చెరుగులో వెచ్చదనపు నీ కౌగిలి
జోల పాడుతూ నన్ను మైమరిపించడం నా జ్ఞాపకం
అత్తవారింట అడుగు పెట్టినప్పుడు అంతా కొత్తగా
అవరోహణంలో జీవిస్తున్నప్పుడు
నా కడుపున నీవో జ్ఞాపికవి
వస్తూ వంటరిగా వస్తాము
తిరిగి వెళ్ళుతూ ఒంటరిగా వెళతామని
నీకు నీవే తోడని నీవన్నప్పుడు నీవో జ్ఞాపికవి
అద్దాన మోము చూసినప్పుడు కంటి క్రింద చారలు
కరుగుతున్న యవ్వనానికి ఓ జ్ఞాపిక
ఆశ నిరాశల మధ్య తప్పొప్పుల గెలుపోటములతో
సాగుతున్న జీవితంపై తృష్ణ నా జ్ఞాపిక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here