Site icon Sanchika

నీవుగాక ఎవరు నా దేవత

[డా. బాలాజీ దీక్షితులు పి.వి. రచించిన ‘నీవుగాక ఎవరు నా దేవత’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నీ[/dropcap] చూపుల కాంతులతో
నా మనసంతా
నీ వెన్నెల ప్రసరింపచేసావు

నీ పెదవుల దరహాసంతో
నా ఎదనంతా
నీ రసజ్వాలతో దహింపచేశావు

నీ వలపుల కుసుమాలతో
నా మదినంతా
నీ పరిమళంతో నిండా నింపేశావు

నీ వయ్యారం దావానలమై
నీ కలల కాసారం లావాగ్నిగుండమై
నీ ప్రణయం విరహాగ్ని నాట్యమై
ఎదురుచూసే
నా ఎదకు.. నీవుగాక ఎవరు నా దేవత
చెప్పు ప్రియా..

Exit mobile version