నెహ్రు ప్లానెటోరియం

0
3

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘నెహ్రు ప్లానెటోరియం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ప్రా[/dropcap]చీన కాలం నుంచి ఎందరో శాస్త్రవేత్తలు ఖగోళాన్ని పరిశోధిస్తూనే ఉన్నారు. విశ్వ విజ్ఞానం గురించి ఎన్నో ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. భూమి, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఆకాశం గురించి తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. విశ్వ రహస్యాలను తెలుసుకోవటం నక్షత్రాలు, తోకచుక్కలు నేల రాలడం గురించి కుడా శాస్త్రవేత్తలుఎన్నో పుస్తకాలు రచించారు.

ఖగోళశాస్త్ర పరిశోధనల్లో గ్రహాల గమనం గురించి అనేక అభిప్రాయాలున్నాయి. సూర్యుడు, భూమి ఈ రెండింటిలో ఎవరి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయనే విషయంలో శాస్త్రవేత్రల మధ్య విభేదాలున్నాయి. చాలా మంది శాస్త్రవేత్తలు భూకేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచారు. అంటే సూర్యుడితో సహా మిగతా గ్రహాలన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాయని విశ్వసించారు. ఈ సిద్దాంతాన్ని టోలెమీ, పైథాగరస్, అరిస్టాటిల్ వంటి శాస్త్రవేత్తలు బలపరిచారు. ఆ సమయంలో కోపర్నికస్ అనే శాస్త్రవేత్త సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇది నచ్చని మత పెద్దలు కోపర్నికస్‌ను బంధించారు చివరకు అలాగే మరణించాడు. సిద్ధాంతాన్ని కూడా బహిష్కరించారు.

గ్రహలలో కొన్ని మంచివని, మరికొన్ని చెడు గ్రహాలనీ, గ్రహాల చలనం వలననే మన భవిష్యత్తు దాగి ఉందని వాటిని బట్టే భూమి మీద ఉండే మానవులకు మంచి చెడులు జరుగుతాయని మన పూర్వీకులు నమ్మడం మొదలుపెట్టారు. తోక చుక్కలు నేల రాలడం కొన్ని రకాల హేతువులకు కారణమని నమ్మడం మొదలైంది. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం కూడా మానవులను కీడు జరిగే సంకేతాలని అనుకునే వారు. గ్రహాలలో రాహువు, కేతువులు ప్రజలకు కీడు చేస్తాయని భయపడటం మొదలు పెట్టారు.

ఖగోళ శాస్త్రంలో ఉండే రహస్యాలను తెలుసుకోవటం కొరకు భారతదేశంలో అక్కడక్కడా ప్లానెటోరియమ్‌లు స్థాపించారు. విద్యార్థులను ప్లానెటోరియమ్ లకు తీసుకువెళితే క్లాసులో బోధించే పాటాలను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. విద్యార్థులు మూఢనమ్మకాల బారిన పడకుండా సత్యాన్ని గ్రహించగలుగుతారు. అoతరిక్షంలో జరిగే ఎన్నో అద్భుతాలను నక్షత్రశాలల్లో వీక్షించ గలుగుతారు. గ్రహంతర యానాల గురించి రేపటి పౌరులు తప్పక తెలుసుకోవాలి.

నేను ఈ మధ్య బెంగుళూరులో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ప్లానెటోరియమ్‌ను సందర్శించాను. అంతకు ముందు కోల్‌కటా లోని సైన్స్ సెంటర్ ను, హైదరాబాద్ లోని బిర్లా ప్లానెటోరియమ్‌నూ, న్యూడిల్లీలోని నెహ్రూ ప్లానెటోరియమ్‌నూ, గుజరాతీ లోని అహ్మదాబాద్ ప్లానెటోరియమ్‌నూ, ముంబై లోని నెహ్రూ ప్లానెటోరియమ్‌నూ చూశాను. నాకు ప్లానెటోరియమ్‌లు చూడటం చాలా ఇష్టం. వాటి గురించి కొద్దిగా వివరించి రాయడమూ ఇష్టమే. ఆయా నగరాల ట్రావెలాగ్‌లు రాసేడుప్పుడు సైన్స్ సెంటరూ, ప్లానెటోరియమ్‌ల గురించి రాశాను. ఈ రోజు జవహర్ లాల్ నెహ్రూ ప్లానెటోరియమ్ గురించి వివరిస్తాను.

జవహర్ లాల్ నెహ్రూ వైజ్ఞానిక వస్తు ప్రదర్శనశాల 1989వ సంవత్సరంలో సాంకీ రోడ్డులో నిర్మించబడింది. ఇందులో ప్రధానమైనది స్కై థియేటర్. ఈ ప్లానెటోరియమ్‌కు లక్షల మంది విద్యార్థులు వస్తారు. డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఈ ప్లానెటోరియమ్‌లు అభివృద్ధి చేయబడ్డాయి. సుమారు నలబై, యాభై ఎగ్జిబిట్ల లో ఉన్న సైన్స్ పార్క్ అందంగా డిజైన్ చేయబడింది.

మేము గంట ముందుగానే వెళ్ళినందున ఎగ్జిబిట్లను బాగా చూడగలిగాము. పెండ్యులమ్‌లు, పుల్లీల పనితీరు సామర్థ్యం గురించిన ఎగ్జిబిట్లు చూసి పిల్లలు చాలా సంతోషపడుతున్నారు. పెద్ద గ్లోబు పార్కు మధ్యలో నిలబెట్టబడి ఉన్నది. సైన్స్ సెంటర్ బిల్డింగ్ ఆకారం కూడా రాకెట్‌లా ఉన్నది. 3D స్పేస్ షోలు చక్కగా నిర్వహించబడుతున్నాయి. బైనాక్యులర్, పెరిస్కోప్, కెలడోస్కోప్‌ల గురించిన విశేషాలు ఆట వస్తువుల రూపంలో ఉన్నాయి. పెరిస్కోప్‌తో దాని కింద ఉన్న కటకం ద్వారం అక్కడున్న అక్షరాలు చదవవచ్చు. పార్క్ మధ్య భాగంలో ఎత్తుగా తెల్లని మెటల్ నిర్మాణాలు గాలికి ఊగుతూ తమాషాగా ఉన్నాయి. గాలికి అన్నివైపులా తిరుగుతూ తమాషాగా అనిపిస్తే ఫోటో తీసుకున్నాను. తర్వాత బోర్టు చూశాక చూస్తే ఆర్టిసిక్ విండ్ మీల్ అని తెలిసింది. తగినంత గాలి ఇక్కడున్క వంకర బీమ్స్ లోకి వెళ్ళినపుడు కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. రకరకాల బరువులను పుల్లీల ద్వారా లాగుతున్నపుడు బరువులో మార్పుల్ని గమనించవచ్చు. గిలకల ద్వారా బరువైన ఇనుప బాల్ లను లాగటంలో ఉండే మార్పులు చూడవచ్చు.

రెసోనెంటే పెండ్యలమ్స్, పుల్లీ అండి వెయిట్స్ ఆన్ ఇన్ క్లైన్డ్ ట్రాక్స్, మోయిర్ పాటర్న్, డి ఎన్ ఏ మోడల్, క్రోమోసోమ్స్ వంటి ఎన్నో మోడల్స్ ఉన్నాయి. రివాల్వింగ్ చెయిర్ అని ఒక కుర్చీ చుట్టు తిరుగుతూ పిల్లల్ని అలరిస్తున్నది. దూరం నుంచి చూసినపుడు ఐన్‌స్టీన్ బొమ్మ కనిపించింది దగ్గరకు వెళ్ళి చూసినపుడు చాలా చిత్రంగా కనిపించింది. నాలుగైదు సర్కిల్స్ లో కన్ను,ముక్కు, జుట్టు, నోరు వేరు వేరుగా అమర్చబడి ఉన్నాయి. కానీ దూరం నుంచి చూసినపుడు మొత్తం బొమ్మ ఒకే ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఇక్కడ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా చలాకీగా అన్నిటినీ ప్రయత్నిస్తున్నారు. నాక్కూడా వాటిని పరిశీలిస్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందో. నా స్యూలు టైములో కూడా ఇలాంటివి చూపించి ఉన్నట్లయితే ఫిజిక్స్ అంటే భయం పోయి ఉండేది అనిపించింది. నేను పొందలేక పోయిన సంతోషాన్ని మిగతా విద్యార్థులకయినా అందజేయాలని ఆశించాను. అందుకే చూసి చూడగానే దీనిని గురించి వివరంగా వ్యాసం రాయాలనుకున్నాను. పిల్లలు, టీచర్లు ఇటువంటివి సందర్శిస్తే బాగుంటుంది. తల్లిదండ్రులు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించాలి.

స్కై థియేటర్ లోని హాల్ లో బ్లాక్ హోల్, గగన్ యాన్, చంద్రయాన్, మిల్కీ వే ల గురించిన విశేషాలను తెలిపే బోర్డులున్నాయి. ఈ మధ్య జరిగిన చంద్రయాన్ విశేషాలు టివిలో చూసి అందరం ఎంతో ఉద్విగ్నతకు గురయ్యాం. మానవ రహిత, మానవ సహిత వ్యోమనౌకల ద్వారా అంతరిక్షం లోకి ప్రయాణం చేయడం గురించిన విశేషాలు పిల్లలకు మరింతగా చేరువ కావాలి.

అర్ధ గోళాకార స్కై థియేటర్‌లో పూర్తిగా వెనక్కి వాలగలిగే కుర్చీలలో కూర్చుని విశ్వవీక్షణం చెయ్యవచ్చు. ఆకాశంలోని నక్షత్రాల గురుంచి ఎన్నో విషయాలు తెలిశాయి. అరగంట పాటు సాగిన సైన్స్ షో మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. సూర్యుడు ఒక నక్షత్రమని దానిలో దాగున్న బ్లాక్ హోల్ గురించిన సమాచారం ఎంతో తెలిసింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం వలననే కాలాలు, రుతువులు ఏర్పడతాయని తెలుసుకోవచ్చు. ఇంకా అమెస్ రూమ్, యాంటి గ్రావిటీ కాటేజ్, ఇల్యూజన్స్ వంటివి ఎన్చో చూడవచ్చు. న్యూట్రాన్ నక్షత్రాలు, సూపర్ నోవాలు, ఉల్కాపాతాలు ఎన్యో తెలుసుకోవచ్చు. మీరు కూడా ప్లానెటోరియమ్ లను చూసి ఆనందించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here