తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో వాసరచెట్ల జయంతి కవితా సంపుటాలు “నేల విమానం” మరియు “తురాయి పూలు” ఆవిష్కరణ తేది: 06-01-2022 సా. 6-00 గంటలకు కళా సుబ్బారావు వేదిక, శ్రీ త్యాగరాయ గానసభలో జరుగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డా. నాళేశ్వరం శంకరం అధ్యక్షతన, ఆవిష్కర్తలుగా తెలంగాణ సాహిత్య అకాడమి పూర్వ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి, ప్రముఖ సాహితీవేత్త ,మేడ్చెల్ అదనపు కలెక్టర్ డా. ఏనుగు నరసింహారెడ్డి, విశిష్ట అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, గౌరవ అతిథులుగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఆత్మీయ అతిథులుగా ప్రముఖ సాహితీవేత్తలు డా. చీదెళ్ళ సీతాలక్ష్మి ,పైడిమర్రి గిరిజారాణి ,డా.బెల్లంకొండ సంపత్ కుమార్ ,గణపురం దేవేందర్ గార్లు పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే.
ఇట్లు
వాసరచెట్ల జయంతి
పుస్తక రచయిత్రి
99855 25355