[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘నేనెవరు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. ]
[dropcap]చు[/dropcap]ట్టూ జనం మూగారు
ఘెరావ్ చేసారు అందామా
చేతి రుమాల్లు తడుస్తున్నవి
ఆ సీన్ నన్ను పలకరించింది
గాలి ఆడనివ్వండి
అలవోకగా అనేశాను
అది శవం అని తెలిసి కూడా
మరణం సహజం
ఇదేమి కొత్తనా
ఎందుకు కారుస్తున్నారు
కన్నీరు అడిగాను
ఏడుపులు ఆగినవి
పిచ్చి వాన్ని చూసినట్టు
చూశారు మరో లోకం
నుండి దిగిన వాన్ని అనుకున్నారేమో
ఈవెనింగ్ వాక్‌కు వెళ్ళాను
ఊరి బయటి చెరువు దగ్గరకు
యంగ్ మాన్ ఒకడు
పరుగెడుతున్నట్టు
నడుస్తున్నాడు చెరువు వైపు
మనసు కీడు శంకించింది
ఆలస్యమైతే శవమై
తేలేవాడు
వెనక్కు లాగాను
What is the matter?
Modern boy లా వున్నాడు
ఆంగ్లంలో అడిగాను
వీళ్లది మమ్మీ డాడీ
బ్యాచ్ కదా
ఆపకుంటే స్వర్గంలో వుండేవాడిని
అమ్మ నాన్న పోలీసు స్టేషన్‌లో
వుండేవారు కోప్పడ్డాను
What is the matter?
తిరిగి అడిగాను
చెయ్యి ఇచ్చింది
బోర్ న ఏడుస్తున్నాడు
అమ్మాయిలు కరవయ్యారా
అడిగాను నేను
ఈ ఐడియా నాకెందుకు
రాలేదు మాస్టారూ
అడుగుతున్నాడు
ఎవరినో
ఒక నిరుద్యోగి
ఉద్యోగం వూడిన సాఫ్టువేర్
తగిలారు సేమ్ టు సేమ్
సిట్యుయేషన్‌లో
బతికి సాధించండి
చస్తే మీ వారు చస్తారు
తిరగలేక పోలీసు స్టేషన్‌కు
మాస్టారూ మీరెవరూ
చెయ్యి తిరిగిన రచయిత
చంపడానికి సిద్ధంగా
వున్నాడు పాత్రలను
Old type ఆలోచన
కొత్తగా ఆలోచించండి
Be positive man
నేను లేను అక్కడ
హలో హలో హలో
మీరెవరూ..
నేనెవరు
మీకు తెలుసా