Site icon Sanchika

సరికొత్త ధారావాహిక ‘నేను.. కస్తూర్‌ని’ – ప్రకటన

[dropcap]వృ[/dropcap]త్తి రీత్యా వైద్యులైన డా. ఎచ్. ఎస్. అనుపమా కన్నడంలో రచించిన జీవితకథని శ్రీ చందకచర్ల రమేశ బాబు అనువదించి ‘నేను.. కస్తూర్‌ని’ అనే పేరుతో సరికొత్త ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నారు.

***

ఇంత పొడుగ్గా చెప్పినా కానీ, నేనెవరు అని ఆనవాలు దొరకడం లేదు కదూ ఎవరని? సహజమేలే. ఇలాగే ఎంత చెప్తూ పోయినా కస్తూర్ గోపాలదాస్ మకన్జి కపాడియా ఆనవాలు మీకు దొరక్కుండా పోవచ్చు. నీళ్ళిస్తున్నా కానీ చెట్టు వేరు కంటికి కనబడదు. వేరుకు పేరూ పెట్టేదిలేదు. దాని జ్ఞాపకమూ ఉండదు. పైన వ్యాపించిన చిగురు, పండు, కాయిలే చెట్టు చేమలకు పేరు తెచ్చేది కదూ! నాదీ అలాంటి కథే అమ్మాయ్!

“నేను ‘కస్తూర్ మోహన్ దాస్ గాంధీ’, ‘కస్తూర్ బా’ లేదా ‘బా’ అంటే? వెంటనే గుర్తు పడతారు కదూ! కళ్ళు విప్పారతాయి. మహాత్ముడి భార్య అంటూ దగ్గరికి వస్తారు, కాళ్ళకు దండం పెడతారు. అదేమో కానీ, కస్తూర్ కపాడియా అని ఉన్నదాన్ని కస్తూర్ బా అయింది: ఒంటరి అమ్మాయిగా ఉన్న నేను పోరాటం, ఉపవాసం అంటూ జైలు కెళ్ళడం: మూగదాన్లా ఉన్నదాన్ని విలేకరులు, రాజకీయ వ్యక్తులతో మాట్లాడేలా అయింది: మా ఇంటి గోడల్ని దాటి ఆవలికి వెళ్ళని దాన్ని దేశ విదేశాలు చుట్టి, విదేశంలోని జైలును కూడా చూసొచ్చింది అదొక పెద్ద ప్రయాణం. ఔనమ్మాయ్! గంగోత్రి నుండి వేలాది మైళ్ళు ప్రవహించి గంగా నది బంగాళాఖాతంలో లీనమవుతూ తాను సముద్రమే అయినట్టు నా ఈ ప్రయాణం..”

***

కస్తూర్‌బా జీవిత కథని ధారావాహికగా చదవండి వచ్చే వారం నుంచి.

Exit mobile version