నేను నేర్చుకున్న ప్రకృతి పాఠాలు

0
2

వెలుగును అంతటా ప్రసరింప చేయాలని,
సూర్యుని చూసి నేర్చుకున్నాను.

అన్ని సమయాల్లోనూ చల్లగా ఎలా ఉండాలో,
ఆ చల్లని గాలిని చూసి నేర్చుకున్నాను.

తన కొమ్మ రెమ్మలు విరిచినా,
నీడనిచ్చి, ఆకలి తీర్చే గుణాన్ని ఆ చెట్టును చూసి నేర్చుకున్నాను.

ఎంత మలినాలను కలబోసినా,
స్వచ్ఛతను చూపే నీటిని చూసి నేర్చుకున్నాను.

అణగద్రొక్కే వారిని ఆదరించాలని,
ఈ భూమాతను చూసి నేర్చుకున్నాను.

మాలిన్యం లేని వారిగా ఉండాలని…
అగ్నిని చూసి నేర్చుకున్నాను.

విశాలదృక్ఫథంతో
చేతనైన సాయమందించగల
అదృశ్యకరాలతో
ప్రకృతి కి మారురూపులా నన్ను నేను తీర్చిదిద్దుకొంటున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here