[dropcap]నీ[/dropcap] నుదుట కుంకుమ జారి
నీ వదనము లక్ష్మీ సదనమయ్యె
అది ఎర్రకలువయని భ్రమించి
భ్రమరము నీ మోముపై వాలె
నీ తలపై మందార కుసుమము
నీ సొగసు చూచి సిగ్గుతో తలవాల్చె
నీ నాసికన కెంపుల ముక్కెర
ఎర్రని చెక్కిళ్ళను గాంచి ముక్కున వేలేసె
నీ కంఠమునున్న కనకహారము
కానరాదాయె, నీ స్వర్ణమేనిచ్ఛాయలో
నెరజాణవు కాదే
విరులను, సిరులను వివశులను చేసిన
నీవు నెరజాణవు కాదే..