Site icon Sanchika

నేస్తాలు – నెయ్యం

[జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీమతి పుట్టి నాగలక్ష్మి ‘నేస్తాలు – నెయ్యం’ అనే కవితని అందిస్తున్నారు.]

[dropcap]మా[/dropcap] ఊరొదిలి వచ్చేశా!
విద్య, వృత్తి, ప్రవృత్తులకు ఊతమిచ్చిందది
కొత్తూరిలో ఎలా వుండాలో?
బెంగెట్టుకున్నా!

ఇంటి ముందు వేపచెట్టు
దాపున పళ్ళతో నోరూరిస్తూ దానిమ్మ, జామచెట్లు
ఒకపక్క ఎర్రమందారాలు, గులాబీలు
మరో పక్క తెల్లని మరుమల్లెలు – విరజాజులు
పసుపు, ఎరుపు వన్నెలతో గుత్తుల నూరు వరహాలు.

పేరు తెలియని పక్షుల కలకూజితాలు
అవెవరివో ?
నా కళ్ళు వెదికాయి..
చిత్రం..
మా ఊళ్ళో మాయమయిన పిచ్చుకలు
ఈ ఊళ్ళో ప్రత్యక్షమయ్యాయి..

అంతేనా..?
కొక్కొరొక్కో! కొక్కొరొక్కో! మేలుకొలుపు పాడే- కోడిపుంజు రాజాలు
నీడ సేదదీరే కోడి పిల్లలు, తల్లులు
రెమ్మ రెమ్మలో గెంతుతూ అల్లరి చేసే ఉడతలు
రెప్పపాటులో కనువిందు చేసి పారిపోయే సీతాకోక చిలకలు.

ఇంతేనా..?
పిల్లాపాపలతో అదిలిస్తూ, బెదిరిస్తూ శీర్షాసనాల పిల్లిమొగ్గలేస్తూ
మమ్మల్ని ఇంట్లోకి తరిమేసే వానరరాజాలు

నన్నలరించే పూలు, పిట్టలు
నాలో సరికొత్త ఉత్సాహాన్ని రేపే
ఉల్లాసాన్నిచ్చి, ఉత్తేజాన్ని కలిగించే
ఈ నేస్తాలు, వాటి నెయ్యం చాలవా..?

Exit mobile version