Site icon Sanchika

నేస్తమా మన స్నేహం

చిరకాలం వీడని నీడలా, కంటికి రెప్పలా తమ స్నేహం నిలిచిపోవాలని కోరుకుంటున్న ఓ మిత్రుడి అంతరంగాన్ని వివరిస్తున్నారు పిల్లల శంకర్రావునేస్తమా మన స్నేహం” అనే కవితలో.

నేస్తమా మన స్నేహం
పువ్వులా ఒక్క రోజులో వాడి పోకూడదు.
ఆకులా కొన్ని రోజులలో రాలి పోకూడదు.
మంచులా కొన్ని గంటలలో కరిగిపోకూడదు.
అలలా కొన్ని క్షణాలలో తిరిగి పోకూడదు.
గాలిలా ఒక్కసారి వీచి ఆగిపోకూడదు.
చిరకాలం నన్ను వీడని నీడలా
కంటికి రెప్పలా మన స్నేహం నిలిచిపోవాలి.

ఆగిపోకు కాలమా ఆశతీరే వరకూ.
జారిపోకు మేఘమా జల్లు కురసే వరకూ.
రాలిపోకు పుష్పమా వసంతము వచ్చేవరకు.
మరిచిపోకు మిత్రమా ప్రాణం వున్నంతవరకూ.

Exit mobile version