Site icon Sanchika

నేటి నాయకులు

[నంద శ్రీ గారు రచించిన ‘నేటి నాయకులు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]తె[/dropcap]ల్లని దుస్తులలో మల్లెపూవులా వున్నా
మనసంతా మురికి కూపమే
దుస్తులు మార్చినంత సులువుగా
మాటలు దాటివేయడమే
నేటి నాయకుల లక్షణం

మాట మాటలో మోసం
కపటం నిండిన వ్యక్తిత్వం
స్వార్థ చిత్తమే నిండుదనం
కల్లును పాలని ప్రచారం చేయటమే
నేటి నాయకుల లక్షణం

దొడ్డి దారిన వచ్చే డబ్బుకై
చెప్పరాని రోత పనులతో
తెల్లని అంగీలో చెల్లని నోటుగా
కనిపించడమే నేటి నాయకుడి లక్షణం

ఎన్నికలలో గెలువుటకు ఎంత
డబ్బయినా వెచ్చించే ప్రజా సేవకులు
గెలిచాక మొహం చాటేసే వంచకులు
గొంతులో వున్న గొంతుతో మాట్లాడక
హృదయసాక్షిగా సదా వంచనే
సత్యం వధే నేటి నాయకుడి లక్షణం

ఓటు కోసం కారుకూతలను నమ్మడము
ఎడారిదారిలో సముద్రం వెతకటమే
పదవులేన్ని వున్నా పని చేయక
పక్కపార్టీ పై అవాకులు పేల్చడం
నేటి నాయకుల లక్షణం

ఓటరు జ్ఞానోదయానికి పూర్వమే
వ్యోమగామిలా అందనంత దూరంలో
మంచితనాన్ని ముంచి గ్రహంతరవాసిలా
మారుటయే నేటి నాయకుల లక్షణం
మేడిపండులాంటి వాళ్లే నేటి నాయకులు

Exit mobile version