Site icon Sanchika

సరికొత్త ధారావాహిక ‘కొడిగట్టిన దీపాలు’

[dropcap]వి[/dropcap]శ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన “కొడిగట్టిన దీపాలు” అనే నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.

***

స్వాతంత్య్రం రాక పూర్వం ప్రజలు, నేతలలో ఉన్న సేవా గుణాన్ని – నిస్వార్థ భావాన్ని, దేశ భక్తిని ఇప్పటి సమాజంలో మసలుతున్న మనుషుల మనస్తత్వాల్ని సరిపోలుస్తూ సాగిన నవల ఇది.

***

“మనం సామాజిక జీవులం. ఈ సమాజంలో ఒకరికి మరొకరి సహాయ సహకారాలు, ఒకరి విూద మరొకరికి ప్రేమతత్వం ఉండాలి. మనం మానవుం, ఒకరి విూద మరొకరికి స్నేహతత్వం, పరోపకారతత్వం, ప్రేమతత్వం లేకుండా జీవించలేము. మనుష్యుల్లోనే కాదు. సకల జీవరాశుల్లోనూ మనకి కనబడుతుంది. క్రూరమైన జంతువులోనూ, సాధు జంతువులోనూ, మనుష్యుల్లోనూ ఈ ప్రేమతత్వం మనకి తప్పక కనిపిస్తుంది’’ విశాలగుప్తా అన్నాడు.

అతని మాటల్లో నిజం ఉందనిపించింది సుజాతకి.

***

ఆసక్తి చదివించే ఈ ధారావాహిక వచ్చే వారం నుంచి.

Exit mobile version