Site icon Sanchika

నిజరూప దర్శనం

[dropcap]స[/dropcap]త్యం, అహింస
దృగ్గోచరించాలంటే –
బాపూజీ కళ్ళజోడు ఒంక చూడు!
మత విద్వేషం, మద్యపానం గుర్తొచ్చినపుడు –
గాంధీజీ మోమును తెరిపారా చూడు!
ఆత్మ శోధన, ఆత్మ విశ్వాసం, ఆత్మాభిమానం తలుపు కొచ్చినపుడు –
వారి నిర్మల వదనం నిశితంగా చూడు!
నిరక్షరాస్యత, అస్పృశ్యత, మహిళలు హక్కులు స్ఫురణకు వచ్చినప్పుడు –
నిరాడంబర మూర్తిమత్వం పరికించి చూడు!
సహాయ నిరాకరణ, సత్యాగ్రహం, ఉపవాస దీక్ష స్వీయ క్రమశిక్షణ నిన్ను తట్టినప్పుడు –
జాతి పిత విశాలహృదయం పరిశీలించి చూడు!
స్వదేశీ నినాదం నీ చెవుల్లో మార్మ్రోగినపుడు –
మహనీయుడు ధరించిన శ్వేత వస్త్రాన్ని చూడు!
మురికి వాడలు నీ కళ్ళముందు కదలాడినపుడు –
మాలిన్యం లేని మహామనిషి మనసును చూడు!
అతడు –
జాతి వివక్షను ప్రశ్నించిన జాతి రత్నం!
కొల్లాయి గట్టి కోట్లాది హృదయాలను
కొల్లగొట్టిన మేలిముత్యం!
మహాత్ముడు –
మానవజాతికి మార్గదర్శి!
మహోన్నత ఉద్యమస్ఫూర్తి!!

Exit mobile version