[box type=’note’ fontsize=’16’] హైదరాబాద్‌లో జరిగే వినాయక నిమజ్జనం సందడిని కవితాత్మకంగా చెబుతున్నారు చామర్తి భానులింగమూర్తి ఈ కవితలో. [/box]
హోరుమనిపించే ..
కేకలు .. గోలలు …డాన్సులు ..
ఎవరో నాయకుని ఊరేగింపని చూస్తే
కాదు .. వినాయకుడిది !.
కొన్ని వందల విగ్రహాలు
ఆకాశాన్ని తాకుతూ ..
హుస్సేన్సాగర్ చుట్టూ ..
యంత్రాల సాయంతో
పైకి లేపూతూ ..దబ్బుమని
ముంచేస్తున్నారు నీటిలో ..
గణేష్ మహారాజ్ కీ జై !!! అంటూ.
ఆ అరుపులు వింటూ ..
సగం తేలి చూస్తున్న గణేష్‌ని
మళ్ళీ ముంచేస్తున్నారు
బలవంతంగా …
మళ్లీ దబ్బున చప్పుడు
చూస్తే ..ఎవరో ..స్త్రీ …
నిమజ్జనమా ?.. ఆత్మహత్యా !?..
వీటన్నిటినీ చూస్తూ ..
తథాగతుడు.
తనుకూడా ఒకప్పుడు
మునిగి తేలినవాడే కదా …
దేవుడికీ …జీవుడికి…
ఈ హుస్సేన్ సాగర్‌కీ
ఏదో… సంబంధం ఉంది!!!