[dropcap]”ఏ[/dropcap]లరా అట్లుండావు?”
“నా ‘టైం’ సరిగ్గా లేదునా… దాన్నింకానే”
“అవునా?”
“ఊనా”
“నిన్ని ఒగ మాట అడగనారా”
“అడుగునా”
“బాగలూరుకి పోయే బస్సు ఏ ‘టైం’కి వస్తుందిరా”
“12 గంటలకినా”
“ఆవులపల్లికి పోయే బస్సురా”
“2 గంటలకినా… ఏలనా అట్ల అడగతావు”
“ఏలంటే బస్సు విడచే ‘టైం’ ఒగటి వుంది కదరా”
“అవునునా”
“కాని చావుకి ‘టైం’ లేదురా, ‘టైం’ చూసుకొని చావు రాదురా. అది నువ్వు తెలుసుకొంటే నీ ‘టైం’ సరిగ్గానే వుంటుందిరా”
“అవును అన్న చెప్పింది నిజమే. దీపం వున్నబుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, మనం ఏ పని మీద భూలోకానికి వచ్చామో అది పూర్తి చేయాలి… ‘టైం’ సరిగ్గానే వుంది”.
***
నిన్ని = నిన్ను