Site icon Sanchika

నిర్బంధం నగ్నరూపం దాల్చిన వేళ

[dropcap]ని[/dropcap]జం నిష్ఠూరంగానే కాదు
నగ్నంగానూ ఉంటుంది
నిజాయితీని కించపరిస్తే
నిప్పులు చెరుగుతూనే ఉంటుంది
అణచివేత ఎప్పుడూ
ఆక్రోశం, ఆగ్రహజ్వాల గానే మారుతుంది!
అల్లకల్లోలాన్నే సృష్టిస్తుంది!
నిబ్బరంగా ఉన్న గుండెలను
నిర్బంధం ఎప్పుడూ నియంత్రించలేదు!
నియంతెప్పుడూ నిటారుగా నిలువలేడు!
అన్నెం పున్నెం తెలీని అమాయకుల అణచివేత
అరాచకత్వానికే దారితీస్తుంది
నిస్సహాయులని నిష్కారణంగా హింసిస్తే
నగ్నహెచ్చరికలు అనివార్యం!

Exit mobile version