Site icon Sanchika

నిర్ణయం – పుస్తక పరిచయం

[box type=’note’ fontsize=’16’] “సమాజంలోని అంతరాలు, సంబంధాలు, బాధ్యతలు, దిగజారుతున్న మానవతా విలువలు ఈ సంపుటిలో దర్శనమిస్తాయి” అంటున్నారు పొత్తూరి సుబ్బారావు “నిర్ణయం” కథాసంపుటి గురించి. [/box]

[dropcap]బొం[/dropcap]దల నాగేశ్వరరావు రచించిన 17 కథల సంపుటి ‘నిర్ణయం’.

‘ఈ పుస్తకంలోని కథలన్నీ మానవ జీవితంలోని ఏదో ఒక పార్శ్వాన్ని చిత్రిస్తూ సాగాయ’ని రాస్తూ, ‘ఈ కథకునికి కథాశిల్పం మీద మంచి పట్టుందని ఈ కథలు రుజువు చేస్తున్నాయని, ఈ కథలన్నింటిలో పఠనీయతా గుణం ఉందని, మానవ నైజాన్ని విశ్లేషించే నేర్పు ఈ కథకుని ఉంద’ని ముందుమాట ‘వాస్తవికతకు అద్దం పట్టిన కథలు’లో అంపశయ్య నవీన్ రాశారు.

“విలువల కోసం తపన పడే కథా రచయితగా నాగేశ్వరరావు గారు చేస్తున్న కృషి అభినందనీయం” అని ‘కథలకు చిరునామా’లో ఈతకోట సుబ్బారావు రాశారు.

సమాజంలోని అంతరాలు, సంబంధాలు, బాధ్యతలు, దిగజారుతున్న మానవతా విలువలు, ఈ సంపుటిలో దర్శనమిస్తాయని, అతిగా వర్ణనల జోలికి పోకుండా సూటిగా విషయాన్ని వ్యక్తపరిచే దిశగా ఈ సంపుటిలోని కథలన్నీ సాగిపోవడంతో కథలలో ఉన్న సందేశం త్వరగా పాఠకుల మనస్సుల్లోకి చొచ్చుకుపోతుందని ‘కదిలించే కథలు’ అన్న ముందుమాటలో పొత్తూరి సుబ్బారావుగారు అభిప్రాయపడ్డారు.

“ఈ సమాజంలో మార్పును తెచ్చి చరిత్రను సైతం తిరగరాయగల శక్తి రచయితకు మాత్రమే వుందని పెద్దలు రాసిన మాటల్ని నమ్ముతూ నా కథల్లో నేను రాసిన ఏ ఒక్క కథయినా పాఠకుణ్ణి కదిలించి ఆలోచింపజేయగలిగితే నేను ధన్యుణ్ణవుతానన్న కాంక్షతో ఈ కథల సంపుటిని మీ ముంచుకు తెచ్చాను” అన్నారు తన మాట ‘కృతజ్ఞతలు’లో.

 

నిర్ణయం
పేజీలు: 120
వెల: రూ.100/-

ప్రతులకు:

బొందల నాగేశ్వరరావు
సుందరి నివాస్
నెం. 31, వాసుకి నగర్, 1వ వీధి,
కొడుంగైయూర్, చెన్నై-600118
ఫోన్: 095000 20101

డాక్టర్ కె.ఎల్.వి. ప్రసాద్
24-టి-322/5,
సహృదయ్ మార్గ్,
రామకృష్ణ కాలనీ,
ఎన్.ఐ.టి. పోస్టు,
హన్మకొండ – 506004,
తెలంగాణ
ఫోన్: 98662 52002,

శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల
హిందూపురం- 515201
ఫోన్: 094932 71620

Exit mobile version