Site icon Sanchika

నిశీధి

[dropcap]ని[/dropcap]శీధి నిశ్శబ్దంగా ఉండి
పాపం ఎన్నేళ్ళయ్యిందో
పల్లెన్నా దానికి
చేయూతనిచ్చేది
నేడు అది కూడా
పట్నం పోకడలు పోతుంది
మధ్యరాత్రయినా నిశీధిలోకి జారకుండా
టీ.వి.ల హోరుతో
స్మార్ట్ ఫోన్ల సందడితో
సినిమా సిద్ధాంతాలతో
సగం పాడైపోయింది
నిశ్శబ్దంగా
విద్యార్థులు నిశీధి ముచ్చట్లు
ఊసులాడుకుంటున్నారు

నిశ్శబ్దం ‘విప్లవం’లా
నిశీధితో కనుమరుగవుతానంటున్నది
నిన్ను జనం మరిచినా
నేను మరువనంటూ
కరోనా రూపంలో నిశీధికి
కొన్ని వందల యేళ్ళ తరువాత
నిశ్శబ్దాన్ని ప్రసాదించింది
ప్రకృతి.

Exit mobile version