[dropcap]ని[/dropcap]షిద్ధ స్వప్నం వాడిని వెంటాడుతుంది
వాడు కేకలతో, కలవరింతలతో రాత్రి పుaచ్చుతాడు
వాడి అసహనం నిషిద్ధమై
నీ శరీరానికి గాయం చేస్తుంది!
శరీరానికి గాయం కావటం అంటే
నేటి చరిత్రకు రేపటి ఆనవాలు కావడం!
ఒక నిషిద్ధ కావ్యం మహాకావ్యమై
పాఠక హృదయ గతమవుతుంది!
ఒక నిషిద్ధ ఫలమే కదా
నేటి సృష్టి అయ్యింది.