‘నూతన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. కొంతమంది పెళ్ళిచేసేముందు చూసేవి తారుమారయ్యాయి (4) |
4. ఏదైనా కొరికి తినలేకపోతే ఇది ఉండాలంటారు(4) |
7. ఇదొచ్చి అడ్డం 22 ని చెడగొట్టిందట (5) |
8. దీన్ని ఆమ్రేడిస్తే పలుమార్లు (2) |
10.ఇదీ జల్లెడా ప్రతి ఇంట్లో ఉంటాయి.(2) |
11. మన పతాకం ఈ పతాకమే (3) |
13. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం అంటే …?(3) |
14. లతలు(3) |
15. ఆడే పాడే పసివాడా పాట రచయిత ఇంటిపేరు(3) |
16. చిన్నప్పుడు గుంటడు. ఇప్పుడు గుంట. వ్యంగ/హాస్య చిత్రకారుడు (3) |
18. కాగితపు ముక్క కొంచెం పెద్ద దే (2) |
21. వెన్న లో రెండో సగం అటునుంచి (2) |
22. దీన్ని అడ్డం 7 చెడిపిందట.(5) |
24. కందులూ ఇవీ పండిస్తారు అటునుంచి తెండి(4) |
25. బాగా కోపమొస్తే దీని మంట నెత్తికెక్కుతుంది(4) |
నిలువు:
1. చూడ్డానికి ఒక ఎండిన పువ్వు లా ఉంటుంది. కానీ పేరు మటుకు ఒక ఆకు.సుగంధద్రవ్యం(4) |
2. కింద నించి ఎందుకలా కూస్తారు?(2) |
3. కొంత సమయం (3) |
4. ఎక్కువ గ (3) |
5. థ కి ఇటూ అటూ (2) |
6. పుడకలా (4) |
9. వేల్పుకొయ్య (5) |
10.అంతులేని ప్రసంగం ట. ఐదోవేదానికి సంబంధం ఉందట (5) |
12.చేరా అంటూ ఒక శతమానం రాసిన కవి ఇంటి పేరు (3) |
15. అరతవ్వలు.(4) |
17. అదేం చిత్రమో! వానరులకేం సంబంధమో? జగముతల్లి! (4) |
19. నో,నెవర్,నాటెటాల్ ! అదేదో పూర్తిగా తెలుగులో ఏడవొచ్చు కదా! ఆగిపోయారేం? (3) |
20. తిరగబడిన బానిస (3) |
22. ఈ నెల ను (2) |
23. దీనికి రాబోకు అంది సైరంధ్రి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూన్ 07 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 13 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూన్ 12 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 11 జవాబులు:
అడ్డం:
1.వనవాసి 4. కల్లుకొంప 7. బుద్ధపూర్ణిమ 8. మాఅ 10. అంతా 11. లిమ్మనె 13. సంతపం 14. మహిషి 15. కచెరి 16. సింగారం 18. విల్లా 21.లుమై 22.చామనచాయ 24. త్రయోదశి 25. రలయవ
నిలువు:
1.వనమాలి 2. వాబు 3. సిద్ధము 4. కర్ణిక 5. ల్లుమ 6. పరితాపం 9. అమ్మకచెల్లా 10. అంతరంగాలు 12. మహిమ 15. కవిమిత్ర 17. రంమైలవ 19. హిమశి 20.విచార 22. చాద 23. యల
నూతన పదసంచిక 11 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- ఈమని రమామణి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కృష్ణ విరజ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- ఎం. అన్నపూర్ణ
- పడమట సుబ్బలక్ష్మి
- పార్వతి వేదుల
- పి.వి.ఆర్.మూర్తి
- పి.వి.ఎన్. కృష్ణ శర్మ
- రంగావఝల శారద
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- వీణ మునిపల్లి
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.