Site icon Sanchika

నూతన పదసంచిక-24

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. తియ్యని మామిడి (4)
4. ఆంగ్లంలో వీరిని క్లర్క్ లు అంటారు (4)
7. జాతిపిత (5)
8. లల్లీ పప్పీలు కోడి,పుంజు ఇందులో ఉన్నాయని క్లాస్ రూం లో పాట పాడేరు (2)
10. తండ్రితల్లి అవ్వొచ్చు తల్లితల్లి అవ్వొచ్చు (2)
11. క్రిష్ణ ఈ దొంగయితే విజయనిర్మల చక్కని చుక్క (3)
13. రాముని కొడుకు చిలిపి (3)
14. ఒక కలనేత చీర ఈమెదా? (3)
15. జగదేక వీరుణ్ణి అతిలోక సుందరి ఇలానే పిలిచింది (3)
16. కొంతమంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. (3)
18. తాయిలమే టూకీగా (2)
21. పూర్వము (2)
22. రేపు ఇదే జరుపుకుంటున్నాం (5)
24. స్వాతంత్ర్య సమరం లో అనేకమంది ఇలా అయ్యారు.(4)
25. అల్లూరి సీతారామరాజు ని చూసి బ్రిటిష్ అధికారులు ఇలా ఆడారు. (4)

నిలువు:

1.  రేపు త్రివర్ణ పతాకం ఎగురవేసేది దీని పైనే (4)
2.  మహాదేవన్ ముద్దు పేరు (2)
3.  మన తెలుగు క్రికెటర్ పేరులో కొంత (3)
4.  భీష్ముడు తడబడ్డాడు (3)
5.  ధైర్యం తిరగబడింది (2)
6. జాతీయ పతాకం లో ఉండేవి.కిందనుంచి మీదకి (4)
9. అణకువని జంతువుతో కలిపి చెప్తారెందుకు? (5)
10. మిగిలినది (5)
12. సినిమా రచయిత కాదు మన వెంకయ్య గారి ఇంటి పేరు (3)
15. రేపు ప్రతిచోటా వినిపించే నినాదం. అయితే మొదటి మూడక్షరాలు లేవు. (4)
17. మగడనుకోకండి. జీవనము (4)
19. స్వాతంత్ర్య సమర యోధుల్లో చాలామందికి ఇవి సగం వేసారంటారా? (3)
20. తెలుగు జాతి మనది. — వెలుగు జాతి మనది (3)
22. ఊయల చివర చిరిగింది (2)
23.  అడ్డం 25 లో ఇదే ఆమ్రేడితమయింది (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఆగస్టు 23వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 24 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఆగస్టు 28 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 22 జవాబులు:

అడ్డం:   

1.పాలకోవా 4. సామాజిక 7. వైనతేయుడు 8. పర‌ 10. పుంజు ‌11. ళ్ళవివా‌ 13. శంఖాలు 14. సోంబేరి‌ 15. సంచయ‌ 16. రిపుండ‌ 18. పని 21. ఖండ‌ 22. రక్తకన్నీరు ‌24. లురాద్దుము‌ 25. సురాపగ

నిలువు:

1.పాచిపళ్ళ‌ 2. కోవై‌ 3. వానలు‌ 4. సాయుధ‌ 5. మాడు‌ 6. కమీజులు‌ 9. రవిగాంచని‌ 10. పుంఖానుపుంఖం 12. బెంబేలు‌ 15. సంపన్నులు 17. డడబిగ‌ 19. సూక్తము 20. పిన్నీసు‌ 22. రద్దు‌ 23. రురా‌ ‌

నూతన పదసంచిక 22 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version