నూతన పదసంచిక-28

0
2

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. మీ వంతో మా వంతో తెలియదు కానీ హాస్తికుడు మాత్రం అటునుంచి వస్తున్నాడు (4)
4. చిన్నప్పుడు బట్టతో కొరికి ఇచ్చేవాళ్ళం (4)
7.  అజీర్తి చేస్తే వచ్చేది (5)
8.  అటునుంచి గుండ్రంగా వస్తోంది (2)
10. ఏడింటిలో మూడూ నాలుగు (2)
11. ఈ జంతువు పేరులో 1,3 చర్మమే (3)
13. మిస్సమ్మ, మాయాబజార్ వీరివే (3)
14. ఇదో ఖాతం. పెద్ద ఇల్లు కూడానట (3)
15. వీటి రవమిది పదములుదా అంటోంది భానుప్రియ (3)
16. సుమమాల చివర తెగింది (3)
18. ఈ కాయ ఆవకాయ బహురుచి (2)
21. ఒక చేత్తో కత్తి ఇంకో చేత్తో ఇది. అటునుంచి చూడండి. (2)
22. పెద్ద వంతు మృగరాజు దే (5)
24. నలుగురి లో ఇది చేయటం న్యాయమా! కృష్ణా! అంటోంది అంజలీదేవి. (4)
25. గ్రామ సింహము (4)

నిలువు:

1. మా మావగారి రెండో కూతురి భర్త  శీర్షాసనం వేసాడు. నాకేమవుతాడు? (4)
2. సొంపులు ముందు ఉండేది (2)
3. మచ్చిక (3)
4. ఇది సముద్రం తో కలిస్తే కల్పవృక్షమట (3)
5.  పద్మరాగము (2)
6.  ఈ కోడిపుంజు ని ఏమనాలో తెలియదు. కిందనుంచి అరుస్తోంది (4)
9.  దీని సంగతి పిల్ల కాకికి ఏం తెలుసు!  అంటారు(5)
10. నటుల అభిమానులు వారి పుట్టిన రోజు నాడు వేసేవి (5)
12. ఒక రకపు బాణాసంచా. నాటి  ప్రముఖ ఆంగ్ల రచయిత్రి పేరులో కొంత కొంచెం తేలికగా (3)
15. ఈ అనుభవం కమల్, రజనీ, ప్రద, సుధలది (4)
17. మదపుటేనుగే .బండారం బయటపడింది (4)
19.  ఉపద్రవం అని దీన్ని కూడా అంటారుట (3)
20. – – – తాళాలిస్తారా ఎవరైనా? (3)
22. మండీ తిరగేసి వేసాడు.పట్టు వదిలేసాడు (2)
23. తిమ్మన గారు దీని సూటి మనిషై ఉంటారు అందుకే అలా అని ఉంటారు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 సెప్టెంబరు 20 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 28 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 సెప్టెంబరు 25 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 26 జవాబులు:

అడ్డం:   

1.అసిధార‌ 4. సంకీర్ణము‌ 7. నామరూపాలు 8. వేగం‌ 10. పరు‌ 11. ణిగతం‌ 13. పోరడు‌ 14. చిత్రాంగి 15. అర్ధణా‌ 16. జవర‌ 18. వమ్ము‌ 21. ధిస‌ 22. చక్కిలిగింత‌ 24. నిమకలి‌ 25. జరాసంధ‌

నిలువు:

1.అరివేణి‌ 2. ధానా‌ 3. రమభ్ర‌ 4.  సంపాతి‌ 5.  కీలు 6.  ముర్మురుడు‌ 9. గంగతీర్ధమ్ము‌ 10.  పరమావధి‌ 12.  మంత్రాంగం‌ 15. అవధాని‌ 17. రసగంధ‌ 19. పుక్కిలి‌ 20. వగింజ‌ 22. చక‌ 23. తరా

‌నూతన పదసంచిక 26 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • లలిత మల్లాది
  • ఎమ్మెస్వీ గంగరాజు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • పి.వి.ఎన్. కృష్ణ శర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శాంత మాధవపెద్ది
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • శ్రీపతి శ్రీనిధి
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here