[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ఈ సుందరి నాలుగు లో ఉన్నవాడి ప్రేయసి (4) |
4. ఒకటి లోని సుందరిని చూసి ఈ వీరుడు రివర్స్ వాకింగ్ చేసాడు (4) |
7. సాయి ప్రసాద్ ఫేమస్ డైలాగ్ మృగరాజు తో (5) |
8. అటునుంచి అర పరాగము(2) |
10. కలయిక లో సగంవిడిపోయింది (2) |
11. సీత హారతి అదో ‘విధం’ గా ఇస్తోంది. ఏవిటా విధం? (3) |
13. ఎంత కోపమొస్తే మాత్రం పనివాడిని అంత గఠిగా అణచాలా ?(3) |
14. కొంత లోహం తో పెద్ద సుత్తి తయారు చెయ్యొచ్చేమో?(3) |
15. మారన్! నేను మారన్! అంటున్నాడు ఈ తోక లేని తమిళ నాయకుడు(3) |
16. మీవీ కాదు! మావీ కాదు. అటునుంచి రండి. ఇటునుంచి శతకకారుడు కూడా కనపడతాడు(3) |
18. ఆట అయిపోయాక ఉత్తరాది వారు అనే మాటలో కొంత (2) |
21. దొరగారి పెద్దగది తిరిగి చూస్తే చిన్నదయింది.(2) |
22. పింగళి వారికి కావలిసిన వాళ్ళు పూర్తిగా రాలేదు(5) |
24. బొట్టు ని చక్కగా దిద్దండి(4) |
25. అత్తగారి తనయ జనకుడు(4) |
నిలువు:
1. సమతా మూర్తి ఈయనే కదా! (4) |
2. తలలోనాలుక లో కలతలు ఎందుకు? ఒద్దు. (2) |
3. తీసివేయొద్దు (3) |
4. ఇది ‘కొంచెం’ శ్రీకాకుళం ప్రజల భాష (3) |
5. దొరగారి కొంత కలిపితే డౌటు రాకమానదు (2) |
6. మురళీ మోహన్ ఢంకా (4) |
9. జయ ని ఐదక్షరాలకి విస్తరించండి. (5) |
10. పురోహితులకు దక్కేవి (5) |
12. ఎక్కడ చూసినా కనిపించే మొక్క . పోతన గారి ఊర్లో కూడా(3) |
15. సి ఎస్ ఆర్ గారు కోపానికి విరుగుడు ఇది చాలన్నారు(4) |
17. అందరూ కొంతవరకు వచ్చి పెట్టుకునే అర్జీ (4) |
19. ఇదుంటే రోషము ఉండి తీరుతుందట 3) |
20. ఎల్వీప్రసాద్ గారి హిందీ నాన్నమ్మ (3) |
22. ఇలా అన్నా అక్కే అట (2) |
23. పూర్వం ప్రత్యేక సంచికలు తేవడం ఈ పత్రిక ప్రత్యేకత (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మార్చి 29 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 3 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఏప్రిల్ 03 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 1 జవాబులు:
అడ్డం:
1.అవకాశం 4. పురస్కారం 7. విభావసువు 8. సలాం 10. అర 11. రుగులు 13. చుప్పతి 14. హ్రస్వము 15. కానజ 16. మతత 18. షాది 21. లుగ 22. ఆరంభ శూర 24. ముకటాత 25. లంబాడీలు
నిలువు:
1.అత్తెసరు 2. కావి 3. శంభాజీ 4. పుసుపు 5. రవు 6. రంస్కారతి 9. లాంగుల్య నది 10. అప్పగింతలు 12. భాస్వరం 15. కాషాయము 17. తగవులు 19. గోరంత 20. త్రిశూలం 22. ఆటా 23. రబా
నూతన పదసంచిక 1 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అన్నపూర్ణ భవాని
- అనురాధా సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావన రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహనరావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కిరణ్మయి గోళ్ళమూడి
- లలిత మల్లాది
- ఎమ్మెస్వీ గంగరాజు
- యం. అన్నపూర్ణ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తాల
- పొన్నాడ సరస్వతి
- పి.వి.ఆర్.మూర్తి
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- సూర్యకుమారి మానుకొండ, డాక్టర్
- శంభర వెంకట రామ జోగారావు
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- వనమాల రామలింగాచారి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.