[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
2. ముఖాన్ని చేతులతో కప్పుకుని వెంటనే తీస్తూ చిన్నపిల్లలతో ఆడుకునే ఆట? (3) |
5. భగవంతుడు అంతర్వేదిలో, మిర్యాలగూడలో ఎక్కడైనా ఉంటాడు. (4) |
7. ఒకప్పటి ఇందిరా కాంగ్రెస్ పార్టీ చిహ్నం (2,2) |
8. సామ్యము లేని మునిసిపాలిటి గుణింతాలను మార్చి సర్దితే కనిపించే చిత్రం (4) |
10. కొండచిలువ (4) |
12. దురదపెట్టే వెన్న (5) |
14. నివురు (3) |
15. ఇంగ్లీషు గోవుతో ప్రారంభమయ్యే ఆభరణము (3) |
16. దురుద్దేశము తేలికై అటుఇటుగా మారి టక్కులమారిగా కనిపిస్తాడితడు. (5) |
18. సంబరం (4) |
19. వెనుకనుండి విపరీతమైన కామేచ్ఛ గల వనిత (4) |
22. బాబాయి (4) |
23. పురుగులు తొలిచే ధ్వని (4) |
24. టెంకాయ చెట్టు (3) |
నిలువు:
1. సంబరమో, సమ్మోదమో (4) |
3. మధ్యతరగతి ప్రజ (3) |
4. తియ్య నీటి కడలి (4) |
6. తతిమ్మా(4) |
7. వాయువ్యానికి వ్యతిరేకం (4) |
9. తీరిక (5) |
10. విష్ణువు (5) |
11. అడ్డం 14 (3) |
13. మూడు విరుపులు కలిగిన ఒక వృత్తపద్య ఛందస్సు (3) |
16. పిల్ల కాలువ కాదు భాగీరథి (4) |
17. చెల్లించ వలసినవి. ముడుపులు కావు. (4) |
18. పిడుగు పడటం (4) |
20. ఏడాదికి సరిపడా శీర్షాసనం వేయండి. (4) |
21. క్రికెట్టు క్రీడ కాదు (3) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 డిసెంబరు 13 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 40 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2022 డిసెంబరు 18 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 38 జవాబులు:
అడ్డం:
1) గుచ్ఛకము 3) దంతెవాడ 8) గుర్రపుడెక్క 9) చింతచిగురు 10) మాకందం 11) పుపిగును 13) తారాజువ్వ 15) అంచెటపా 18) తలకట్టు 21) వుప్పల 23) పలుకుబడి 24) కారుకూతలు 25) మేనల్లుడు 26) ఏకవీర
నిలువు:
1) గుడిగుడి 2) కడుపుతీపి 4) తెరచిరాజు 5) డమరువు 6) రెక్కమాను 7) తోచిందంతా 12) గుప్పిట 14) రాజిల 16) చెరుకు విల్లు 17) పావుడియా 18) తలకాయ 19) కలకూజిక 20) కంపరమే 22) పలుతెర
నూతన పదసంచిక 38 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయ
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి శ్రీనివాసరావు సొంసాళె
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వెంకాయమ్మ టి
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.