‘నూతన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. తాపసి చేసే అభిశంసన (2,2) |
4. పాయకారావుపేటలో లభ్యమయ్యే బాణసంచా (4) |
6. ఆఖరి మెట్టు (3,2) |
7. ఈ పాట పాడటానికి సంగీత పరిజ్ఞాన మేమీ అక్కరలేదు. (3,2) |
8. కాపీయింగు (4) |
11. డేగ ముఖానికి కట్టిన గంత చెదిరింది. (4) |
14. మలయజంలోని రిధమ్ (2) |
15. ప్రహేలికలో దాగిన ప్రభాకరుడు (2) |
16. పలువురు రచయితలు కూర్చిన పుస్తకం (4) |
17. సప్త వాయువులలో ఒకదానిని సరిచేస్తే జగడమే. (4) |
18. అసంపూర్ణమైన ముస్లిముల ప్రార్థనాలయం (2) |
19. రామాలయంలో హారం (2) |
20. ఏకామ్ర పీఠంలో నెలకొని ఉన్న శక్తిస్వరూపిణి (4) |
23. ఈ సుమగాత్రి సీతమ్మ తల్లి. (4) |
25. ఎలెక్ట్రాన్ అనే కలం పేరు కలిగివున్న తెలుగు కథకుడు (5) |
28. వినాయకుడి తలకు అసలుసిసలు హక్కుదారు (5) |
29. ఈ కార్యకర్త ముసలోడి లెక్కన కనిపిస్తాడు (4) |
30. నిలువు 23 కాదు. మామూలు మనిషి (4) |
నిలువు:
1. క్రిందినుండి చలిగాడ్పు వీస్తున్నది. (4) |
2. పంపకం పూర్తయ్యింది. (4) |
3. గజాననుడు (4) |
4. క్రికెట్లో వరుసగా ఆటగాళ్ళు ఓడిపోతుంటే “__ __ రాలిన వికెట్లు – కుప్పకూలిన జట్టు” అని హెడ్డింగ్ పెడుతుంది మన మీడియా. (2,2) |
5. అవజయముతో పెట్లుప్పు(4) |
9. తెలుగులో బెస్ట్ సెల్లర్ నాటకం గయోపాఖ్యానం రాసింది ఈయనే. (5) |
10. సీతారామ ఆలయమునందలి ఎనిమిది జిల్లాల భూభాగం (5) |
12. ఝండా ఊంఛా __ __ (2,3) |
13. మొదటి ప్రేమ (2,3) |
20. పురుగు కాదు. అలా భ్రమపెట్టే గుర్రము. (4) |
21. మా ఇంటికి ఇద్దరు భోగమువాళ్ళు వచ్చారు. ఒకతె ఆడుతుంది. ఇంకొకతె ఆడదు. ఏమిటది? (4) |
22. బలి చక్రవర్తి కుమారుడు ఈ సహస్రబాహువు (4) |
23. లక్ష్మీపతి కాస్త అటూఇటు అయ్యాడు. (4) |
24. తిరుగుబోతు (4) |
26. మరుధూరి రాజాతో హాయిని గొలిపే అనుభూతి (2) |
27. వస్తారుకు పూర్తిగా వ్యతిరేకం (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జనవరి 31వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 47 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఫిబ్రవరి 05 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 45 జవాబులు:
అడ్డం:
1.హేషి 3. కంచం, 5. తిరి 7. క్రవ్య 9. దాశరథి 12. బొచ్చు 14. యమి 16. శివం 17. సెజ్జ 18. రఘు 20. తిరు 22. వర 24. టపా 26. రుమేనియా 29. గిత్త 30. వళి 31. ఖలు 32. క్రోల 33. ఉండ 34. నెలవులు 36. కయి 38. సుండి 39. గుత్తి 40. లిపి 42. దుప్పి 43. వద 45. కిరి 47. వెన్న 48. ప్రోత్సాహము, 50. రిక్షా 52. రజ్జు 53. నాంది 54. నిధి
నిలువు:
2.షిక్ర 4. చందా 5. తిథి 6. త్రచ్చు 8. వ్యయ 10. శశి 11. రవం 12. బొజ్జ 13. బూర 15. మితి 17. సెర 19. ఘుట 21. రురు 22. వయా 23. రిత్త 25. పావడ 27. మేఖల 28. నిలువు 29. గిలక 33. ఉండి 34. నెత్తి 35. లులి 37. యినాం 38. సుంకం 39. గుప్పి 41. పికి 42. దున్న 43. వత్సా 44. దహ 46. రిరి 47. వెజ్జు 48. ప్రోది 49. ముని 51. క్షాత్ర
నూతన పదసంచిక 45 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- జానకి సుభద్ర పెయ్యేటి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.