‘నూతన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. పునర్వసు నక్షత్రం (3) |
| 3. సిలాసత్తు కొయ్య, రచయిత కాదు (4) |
| 6. కేకి (2) |
| 7. నిలువు 6 చూడండి. ఆనందం (2) |
| 8. చదువ దగిన స్త్రీ (3) |
| 10. కంటి పిసరు (2) |
| 11. వెంగళరావు గారి ఇంటి పేరులో సున్న లుప్తమయ్యింది (3) |
| 12. దట్టమైన పొగమంచు. (3) |
| 14. గుడ్డులోని గిజురును తొలుత దీర్ఘంచేస్తే చిన్నవాన కురుస్తుంది. (2) |
| 16. బొంగరాలు ఆడటానికి ఉపయోగించే త్రాడు (2) |
| 17. ఎకసక్కెము (5) |
| 20. ఒకనాటి తెలుగు సినిమా శృంగార తార. నర్తకి. (2) |
| 22. ఉత్తర భారతదేశపు ఒక బ్రాహ్మణుల ఇంటిపేరు (3) |
| 23. సంచులు కుట్టడానికి పనికొచ్చే సూది. దాంట్లో బలం ఉంది. (3) |
| 24. కందర్ప మోహన్ దాచుకొన్న ఉండ్రాయి (3) |
| 26. ఈ రిమార్కు మామూలే (2) |
| 27. తడబడే నడక (5) |
| 30. బొంగూ భోషాణంలో ఆఖరుది. (2) |
| 32. వాక్కాంత (2) |
| 33. భూనాగ వృక్షము (3) |
| 35. వజ్రాయుధం సోమసుందర్ గారిది కాదు. ఇంద్రుడిదే. (3) |
| 36. మత్తు కొరకై పుస్తకములో వెదకండి. (2) |
| 37. శాల్మలి గురించి పెరంబూరు గణేష్ను అడగండి (3) |
| 39. అడ్డం 8 లోని తీట (2) |
| 41. ముంగిస (2) |
| 42. అం గీరసుడి మూడో కూతురు (4) |
| 43. నడబావి (3) |
నిలువు:
| 1. కడుపుబ్బ నవ్వడంలో కనిపించే చుక్క. (2) |
| 2. సరస్వతుల రామ నరసింహం గారి కొలను. (3) |
| 4. అడ్డం 42 సృష్టికర్త ఇంటావిడ. ఈ మధ్యే మరణించారు. (4) |
| 5. ఆత్మార్థకము (2) |
| 6. అడ్డం 7 చూడండి. సంతోషం (3) |
| 9. అడ్డం 8 చూడండి. (3) |
| 10. వాన రాకతో సంపు తోక కత్తిరిస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల సర్వం కోల్పోయిన వారికి తగిన వనరులు కల్పించినట్టవుతుంది. (5) |
| 13. అడ్డం 8 కి హ్రస్వరూపం అనొచ్చా? (2) |
| 14. సాపత్యము (3) |
| 15. అంటించేది. అతుక్కొనేది. (2) |
| 16. వల, మొగ్గ (2) |
| 18. సాచి,సహురి (2) |
| 19. రాయితీ (3) |
| 20. హల్లుతో తేలికగా అంతమయ్యే పదం (3) |
| 21. దోమకాటు వల్ల వ్యాపించే ఒక వ్యాధి (5) |
| 24. టమోటతో నీరుతోడే సాధనం (2) |
| 25. ఓ రకం మిల్లెట్టు. కొర్రలు. (3) |
| 26. కచ్ఛూరకము (2) |
| 28. సింహాచలంలో కొలువున్న స్వామి మొదలు లుప్తము. (2) |
| 29. ప్రభువును మరోవిధంగా పిలవండి. (2) |
| 30. తెలుగు పీటరు (3) |
| 31. పౌర్ణమి సినిమా దర్శకుడు. (4) |
| 34. సృగాలం (3) |
| 36. తరహా (3) |
| 38. కాఫీ డికాక్షన్ అవక్షేపం (2) |
| 40. ఉపస్థాయకుడు కలిగిన నేల (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఏప్రిల్ 11వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 57 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఏప్రిల్ 16 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 55 జవాబులు:
అడ్డం:
1.అమీబా 3. కర్బూజ 5. దుందుభి 7. పహారా 8. రసీదు 10. దాసుడు 12. చీర 14. పాడు 16. వానకోయిల 17. తదనంతరము 20. సీర 22. బికాసి 23. సంచిక 25. రీతి 27. రాతలుకోతలు 29. తియ్యదనము 30. పాక్ష 31. డులి 33. చలవ 35. కాముకం 37. లిగువు 38. చావడి 39. పరీక్ష 40. కరాళి
నిలువు:
1.అల్విదా 2. బాపడు 3. కరాచీ 4. జర 5. దుందు 6. భిల్లుడు 9. సీతాకోకచిలుక 11. సునంద 13. రవాము 14. పాలసీ, 15. చాతకానందనము 17. తయారీ 18. నంబి 19. రసి 21. రప్పలు 23. సంత 24. కకో 26. తితిక్ష 27. రాముడు 28. తపేల 30. పావంచా 32. లిలిక్ష 33. చవుక 34. వరాళి 35. కాడి 36. కంప
నూతన పదసంచిక 55 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- జానకి సుభద్ర పెయ్యేటి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.















